అక్కడ ‘ఆర్‌ఎక్స్‌100’ అట్టర్‌ ఫ్లాప్‌.. ఇదే కారణం     2018-07-19   11:45:06  IST  Ramesh Palla

గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రం యూత్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకు పోతుంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి అయిదు రోజుల్లో ఈ చిత్రం 10 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను వసూళ్లు చేసింది. లాంగ్‌ రన్‌లో ఈ చిత్రం సునాయాసంగా 10 కోట్ల షేర్‌ను రాబడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ సమయంలోనే ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంను ఓవర్సీస్‌లో విడుదల చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధిస్తున్న కారణంగా ఓవర్సీస్‌లో కూడా మంచి వసూళ్లు వస్తాయని అంతా భావించారు. కాని షాకింగ్‌గా అక్కడ ఫలితం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.

తెలుగు చిత్రాలకు ఈమద్య ఓవర్సీస్‌లో మంచి మార్కెట్‌ అవుతుంది. నైజాం ఏరియాలో ఏ స్థాయి వసూళ్లు నమోదు అవుతున్నాయో అలాగే ఓవర్సీస్‌లో కూడా వస్తున్నాయి. అందుకే ఆర్‌ఎక్స్‌ 100 చిత్రానికి కూడా భారీగా వసూళ్లు వస్తాయని ఆశించారు. అయితే షాకింగ్‌గా నాలుగు రోజుల్లో కేవలం లక్ష డాలర్లు మాత్రమే వచ్చాయి. ఈ చిత్రంలో బోల్డ్‌ కంటెంట్‌ అధికంగా ఉండటంతో పాటు, పైరసీ కాపీ రావడంతో ఓవర్సీస్‌ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూసేందుకు ఆసక్తి చూపడం లేదు.

Rx 100 Movie Poor Collections In Overseas-

Rx 100 Movie Poor Collections In Overseas

ఓవర్సీస్‌లో ప్రేక్షకులు ఎక్కువగా ఫ్యామిలీతో సినిమాలకు వెళ్లాలని భావిస్తారు. కాని ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రం ఫ్యామిలీతో వెళ్లే విధంగా లేదు. లెక్కకు మించిన ముద్దు సీన్స్‌, హద్దులు దాటిన రొమాంటిక్‌ సీన్స్‌ ఉన్న కారణంగా ఈ చిత్రంను అక్కడ ప్రేక్షకులు వద్దనుకుంటున్నారు. ఫ్యామిలీతో వెళ్లే వీలుండే చిత్రాల కోసం వారు వెయిటింగ్‌ చేస్తున్నారు. అందుకే ఈ చిత్రంకు అక్కడ మినిమం ఖర్చులు కూడా రాలేదు. ఇంత దారుణంగా అక్కడ కలెక్షన్స్‌ నమోదు అవుతాయని ఊహించ ఉండరు.

ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీగా కలెక్షన్స్‌ నమోదు చేయడంతో పాటు, భారీ ఎత్తున శాటిలైట్‌ రైట్స్‌ ద్వారా అమ్ముడు పోయింది. తమిళం మరియు హిందీ శాటిలైట్‌ రైట్స్‌కు కూడా భారీగా డిమాండ్‌ ఉంది. మొత్తంగా మూడు కోట్లతో రూపొందిన ఈ చిత్రం ఏకంగా 20 కోట్లను నిర్మాత ఖాతాలో వేసే అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి సక్సెస్‌ మూవీ ఓవర్సీస్‌లో మాత్రం లక్ష డాలర్ల వద్ద క్లోజ్‌ అవ్వడం కాస్త సోచనీయమే. ఓవర్సీస్‌లో కూడా మంచి కలెక్షన్స్‌ నమోదు అయితే నిర్మాత లాభాలు మరింతగా ఉండేవి.