'ఆర్‌ఎక్స్‌ 100' దర్శకుడు మల్టీస్టారర్‌ 'మహాసముద్రం'.. ఆందోళనలో బెల్లంకొండ

అజయ్‌ భూపతి… ఈ పేరు ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం విడుదలకు ముందు ఎవరికి తెలియదు.రామ్‌ గోపాల్‌ వర్మ వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా చేసిన అజయ్‌ భూపతి ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంతో ఒక్కసారిగా స్టార్‌ అయ్యాడు.

 Rx 100 Movie Director Multistarrer With Bellamkonda Srinivas-TeluguStop.com

ఆయనతో సినిమా చేసేందుకు యంగ్‌ హీరోలు ఆసక్తి చూపించారు.అయితే అజయ్‌ భూపతి మాత్రం ఎట్టకేలకు బెల్లంకొండ శ్రీనివాస్‌తో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు.

మహాసముద్రం అనే టైటిల్‌ ను కూడా ఖరారు చేసినట్లుగా ప్రకటించాడు.స్క్రిప్ట్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంకు సంబంధించి ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

బెల్లంకొండ శ్రీనివాస్‌తో పాటు ఈ చిత్రంలో మరో హీరో కూడా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.బెల్లంకొండ శ్రీనివాస్‌తోనే మొదట సినిమా చేయానలి భావించినా స్క్రిప్ట్‌ డిమాండ్‌ మేరకు మరో హీరోను కూడా ఈ చిత్రంలో తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.మహాసముద్రం చిత్రంలో మరో యంగ్‌ హీరో నటిస్తే బెల్లంకొండ శ్రీనివాస్‌ ప్రాముఖ్యత తగ్గుతుంది.ఈ విషయం ప్రస్తుతం బెల్లంకొండకు టెన్షన్‌ కలిగిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.బెల్లంకొండ ప్రస్తుతం చేస్తున్న ‘సీత’ మూవీ విడుదల కాకముందే ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.

‘మహాసముద్రం’ టైటిల్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అజయ్‌ భూపతి మరోసారి సక్సెస్‌ కొట్టడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందన్ను మహాసముద్రం మల్టీస్టారర్‌ అయితే డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమాపై ఆసక్తిని కనబర్చే అవకాశం ఉందని దర్శకుడు భావిస్తున్నాడు.పాతిక కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్‌ చేస్తున్నారు.

చిన్న హీరోలతో పాతిక కోట్లు అంటే కాస్త ఓవర్‌ అయినా కూడా మల్టీస్టారర్‌ అది కూడా అజయ్‌ భూపతి దర్శకత్వం వల్ల నిర్మాతలు భయం లేకుండా పెడుతున్నారు.మాఫియా నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని సమాచారం అందుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube