RX 100 దర్శకుడు లవ్ ఫెయిల్ అయ్యి, మద్యానికి బానిసై, సూసైడ్ చేసుకోవాలనుకున్నారా?

టాలీవుడ్ లో చిన్న సినిమాలకు ఇటీవల అందుతున్న క్రేజ్ మాములుగా లేదు.కంటెంట్ ఏ మాత్రం కొత్తగా ఉన్నా కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పెట్టేస్తున్నారు.

 Rx 100 Movie Director Ajay Bhupathi Love Story-TeluguStop.com

ఈ ఏడాది వచ్చిన చిన్న సినిమాల్లో అతిపెద్ద విజయం అందుకున్న సినిమాగా ఆర్ఎక్స్ 100 నిలిచింది.సినిమాలో మసాలా ఎక్కువైందని సినీ విమర్శకులు కామెంట్స్ చేస్తున్నప్పటికీ యూత్ మాత్రం సినిమాను తెగ చూసేస్తున్నారు.

ఇప్పటికే సినిమాకు పెట్టిన బడ్జెట్ కి డబుల్ షేర్స్ అందాయి.అయితే తన సినిమాపై వస్తున్న విమర్శల్ని తిప్పికొడుతున్నాడు దర్శకుడు.

నేను తీసిన ‘RX 100’ సినిమాలో 10 పర్సంట్ రొమాంటిక్, 90 పర్సంట్ ఎమోషన్స్ ఉంటాయి.90 శాతాన్ని వదిలేసి 10 శాతాన్ని పట్టుకోవడాన్ని తప్పుపట్టారాయన.నేను సినిమా విడుదలకు ముందే చెప్పా రొటీన్ సినిమాలను కోరుకునే వాళ్లు నా సినిమాకు రావొద్దని ఇది రొటీన్‌ని సినిమా కాదు అన్నారు.నా జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తీశాను.

ఇది బూతు సినిమా కాదు.వాస్తవ జీవితం.

ఇందులో కల్పితాలు ఏమీ లేవన్నారాయన.

ఇది ఇలా ఉంటె.నేను ప్రేమలో విఫలమయ్యాక మానసిక వేదనకు గురయ్యాను.ఆ టైంలోనే మద్యానికి కూడా అలవాటయ్యాను.

ఐదేళ్ల క్రితం జరిగిన ఆ సంఘటనతో చాలా కుంగిపోయా.అయితే ఆ టైంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అంటూ ప్రచారం నడుస్తోంది.

అందులో నిజం లేదు.అదే టైంలో నా గురువు రామ్ గోపాల్ వర్మ.

నీ బాధను క్యాష్ చేసుకో అని సలహా ఇచ్చారు.అప్పుడు మిగతా కథలను పక్కన పెట్టేసి నా కథను ‘RX 100’గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చా అన్నారు.

ఈ సినిమాలో హీరోగా వేరే వారిని కూడా కలిశారంట.కానీ వాళ్ళు రిజెక్ట్ చేసారు.పెళ్లి చూపులు సినిమా ఇంకా రిలీజ్ కాకముందే అజయ్ భూపతి విజయ్ దేవరకొండను కలిసి ఆర్ఎక్స్ కథను వినిపించాడట.కానీ అప్పుడు విజయ్ పెద్దగా ఆ కథపై ఇంట్రెస్ట్ చూపించలేదట.

ఇక సూపర్ స్టార్ ఫ్యామిలీకి చెందిన సుదీర్ బాబును కూడా ఈ కథ కోసం హీరోగా ఎంచుకున్నడట.దాదాపు మూడు నెలల వరకు అతను చుట్టూ తిరిగాడు.

కాని సుదీర్ బాబు కథ బాగానే ఉంది కానీ ఎందుకో నచ్చక వదిలేసినట్లు తెలుస్తోంది.ఇక దర్శకుడు అజయ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ హీరోపై కసితో ఈ సినిమా చేసినట్లు వివరణ ఇచ్చాడు.

తనను తాను దర్శకుడిగా నిరూపించుకోవాలని బోల్డ్ కంటెంట్ తో కథకు తగ్గట్టుగా ఆర్ఎక్స్ 100 సినిమాని తెరకెక్కించినట్లు తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube