ఆర్‌ఎక్స్‌ 100.. హీరోయిన్‌ తెలివి తక్కువ నిర్ణయం.. చరణ్‌కు నో  

Rx 100 Movie Actress Rejects Ram Charan-

కార్తికేయ హీరోగా నటించిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పూత్‌.ఈఅమ్మడు ఆ చిత్రంలో నెగటివ్‌ రోల్‌లో కనిపించి, బోల్డ్‌గా నటించి అందరిని అలరించింది.హీరోతో రొమాంటిక్‌ సీన్స్‌తో పాటు, కొన్ని సీన్స్‌లలో మంచి నటన కనబర్చింది.అందుకే ఈమెకు మంచి భవిష్యత్తు ఉందని అంతా అనుకున్నారు..

Rx 100 Movie Actress Rejects Ram Charan--RX 100 Movie Actress Rejects Ram Charan-

సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఈమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి.అయితే పాయల్‌ తన తెలివి తక్కువ తనంతో మంచి అవకాశాలను మిస్‌ చేసుకుంటుంది.

అఖిల్‌, వెంకీ అట్లూరిల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో ఒక ముఖ్య పాత్రను ఈమెతో చేయించాలని దర్శకుడు అనుకున్నాడు.కాని హీరోయిన్‌ పాత్ర తప్పితే మరే పాత్రలు చేయను అంటూ తేల్చి చెప్పింది.

ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌, తేజల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో ఈమెకు సెకండ్‌ హీరోయిన్‌గా ఛాన్స్‌ వచ్చింది.ఈ ఆఫర్‌ను కూడా పాయల్‌ తిరష్కరించింది.పాయల్‌ నో చెప్పడంతో ఆ ఛాన్స్‌ను మెహ్రీన్‌ దక్కించుకుంది..

మొత్తానికి పాయల్‌ మంచి ఛాన్స్‌లు మిస్‌ చేసుకుందని అనుకుంటున్న సమయంలో మరో మెగా ఆఫర్‌ను ఈమె చేజేతులారా వదుకుంది.

‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంలో హీరోయిన్‌గా గ్లామర్‌తో అలరించిన పాయల్‌ రాజ్‌పూత్‌కు రామ్‌ చరణ్‌, బోయపాటి చిత్రంలో ఐటెం సాంగ్‌ చేసే అవకాశం దక్కింది.పెద్ద హీరోలు కూడా స్టార్‌ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఇలాంటి సమయంలో పాయల్‌ రాజ్‌పూత్‌ మాత్రం ఐటెం సాంగ్‌కు నో చెప్పింది.

ఇప్పుడే తాను ఐటెం సాంగ్‌ చేయను అని, హీరోయిన్‌గానే కొంత కాలం చేయానుకుంటున్నట్లుగా బోయపాటికి చెప్పుకొచ్చింది.

పాయల్‌ నో చెప్పడంతో మరో స్టార్‌ హీరోయిన్‌తో ఐటెం సాంగ్‌ను చేయించేందుకు బోయపాటి శ్రీను ప్రయత్నాలు చేస్తున్నాడు.మొత్తానికి పాయల్‌ రాజ్‌పూత్‌ మంచి అవకాశాలను వదులుకుంటూ తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటుంది అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం పాయల్‌కు చాలా కీలకమైన సమయం.

ఈ సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే కెరీర్‌పై దెబ్బ పడే అవకాశం ఉంది.ఆ విషయాన్ని ఆమె గ్రహించకుంటే ముందు ముందు మరింత నష్టం తప్పదు.