మొత్తానికి హీరోని కన్ఫర్మ్ చేస్తున్న ఆర్ ఎక్స్ 100 దర్శకుడు  

Rx 100 Director Confirm A Hero For His Mahasamudram Movie-confirm A Hero,mahasamudram Movie,rx 100 Director,sharvanand

ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆర్జీవి శిష్యుడు అజయ్ భూపతి.మొదటి సినిమాతోనే మంచి టాలెంట్ ఉన్న దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకొని సూపర్ హిట్ కలెక్షన్స్ తో తన స్టామినా ప్రూవ్ చేసుకున్న అజయ్ భూపతి బయట తన ఆటిట్యూడ్ విషయంలో కూడా ఆర్జీవి శిష్యుడుని అనిపించుకున్నాడు.

RX 100 Director Confirm A Hero For His Mahasamudram Movie-Confirm Mahasamudram Movie Rx Sharvanand

ఇక ఆ సినిమా తర్వాత టాలీవుడ్ లో బడా నిర్మాతల నుంచి అతనికి పిలుపు వచ్చింది.అయితే ఏ కారణాల వలనో చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.

తన నెక్స్ట్ మూవీని మహా సముద్రం టైటిల్ తో తెరకెక్కిస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించేశాడు.తరువాత ఈ సినిమా కోసం హీరో వేటలో పడ్డాడు.


ముందుగా నితిన్ తో సినిమా చేస్తాడని టాక్ వచ్చింది.అయితే అది సెట్ కాలేదు.తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా ఉంటుందని అఫీషియల్ ఎనౌన్స్ చేసేశారు.అది జరిగి ఏడాది దాటిపోయిన ఎందుకనో వీళ్ళు సెట్స్ కి వెళ్ళలేదు.

ఇక ఫైనల్ గా నాగ చైతన్య, సమంత జోడీగా ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావించాడు.అయితే ఈ కాంబినేషన్ కూడా సెట్ కాలేదు.దీంతో ఈ ప్రాజెక్ట్ ఫైనల్ గా టాలెంటెడ్ హీరో శర్వానంద్ దగ్గరకి వచ్చి ఆగింది.శర్వా ఈ కథ వినగానే అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

దీంతో శర్వాతో ఫైనల్ గా మహా సముద్రం ప్రాజెక్ట్ ని అజయ్ భూపతి సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నాడు.ప్రస్తుతం 96 రీమేక్ జాను షూటింగ్ లో ఉన్న శర్వానంద్ దానిని కంప్లీట్ చేయగానే అజయ్ భూపతి ప్రాజెక్ట్ ని రెడీ అవుతాడని తెలుస్తుంది.

తాజా వార్తలు

Rx 100 Director Confirm A Hero For His Mahasamudram Movie-confirm A Hero,mahasamudram Movie,rx 100 Director,sharvanand Related....