వైరల్‌ : రువాండా దేశం గురించి ప్రపంచం మొత్తం వెదుకుతోంది, ఎందుకో తెలుసా?

ఆఫ్రికాలో ఎన్నో చిన్న చిన్న దేశాలు ఉంటాయి.ఆ దేశాల్లో కనీసం మూడు నాలుగు కూడా ప్రపంచానికి పెద్దగా తెలియదు.

 Rwanda Is The Worlds Best Clean Country With Umuganda Rule-TeluguStop.com

ఆయా దేశాలకు ఉన్న ప్రాముఖ్యత పెద్దగా ఏమీ లేకపోవడంతో చాలా మంది ఆ దేశాలను పట్టించుకోరు.ఎప్పుడైనా చెప్పాల్సి వస్తే ఆఫ్రికా దేశం అంటారు తప్ప ప్రత్యేకంగా పేరు పెట్టి చెప్పడం జరగదు.

కాని ఇప్పుడు ఆఫ్రికాకు చెందిన రువాండా అనే దేశం గురించి ప్రపంచం మొత్తం కూడా ఎంతో ఆసక్తిగా వెదుకుతోంది.ఆ దేశంలో ఉన్న పారిశుద్య విధానం గురించి ప్రస్తుతం మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

1994లో ఈ దేశంలో అపరిశుభ్ర వాతావరణం కారణంగా అంటు వ్యాదులు ప్రభలి మారణహోమం జరిగింది.వేలల్లో జనాలు చనిపోవడంతో అప్పటి నుండి ప్రభుత్వం ప్రత్యేక పారిశుద్ద విధానంను చట్టంగా తీసుకు వచ్చింది.

నెలలో చివరి శనివారం ఆఫీస్‌లకు అన్నింటికి సెలవు ఇస్తారు.ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి పరిసరాలను తమ వీధులను తమకు తాముగా పరిశుభ్రం చేసుకోవాలి.

ఆ దేశ అధ్యక్షుడి నుండి కింది స్థాయి వారు వరకు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున క్లీన్‌ అండ్‌ వాష్‌ పోగ్రాంలో పాల్గొంటారు.

ఈమద్య కాలంలో అన్ని దేశాలు కూడా ప్లాస్టిక్‌ను నిషేదించాలని మొత్తుకుంటున్నాయి.

కాని రువండాలో మాత్రం పాతిక సంవత్సరాల క్రితమే ప్లాస్టిక్‌పై నియంత్రణ తీసుకు వచ్చారు.అక్కడ వీధులు, రోడ్లు ఇలా అన్ని కూడా ఎంతో అద్బుతంగా క్లీన్‌గా ఉంటాయి.

ప్రతి ఒక్కరు కూడా అక్కడ చాలా క్లీన్‌గా ఉంటారు.రోడ్ల మీద.బస్‌స్టాప్స్‌లో ఎక్కడ పడితే అక్కడ చేతులు వాష్‌ చేసుకునేందుకు ఏర్పాట్లు ఉంటాయి.ముఖ్యంగా బస్‌స్టాండ్స్‌ రైల్వే స్టేషన్స్‌కు వెళ్లే వారు.

వెళ్లి వచ్చే వారు ఖచ్చితంగా అక్కడే ఉండే హ్యాండ్‌ వాష్‌ను ఉపయోగించాల్సిందే.ఎవరైనా ఉపయోగించకుంటే వారికి కఠిన శిక్ష తప్పదు.

Telugu Eliminates, Nationalcleanup, Africa, Umuganda-

రువాండా తీసుకు వచ్చిన ఈ పరిశుభత్ర చట్టానికి ఉముగాండా అనే పేరు పెట్టారు.ఈ చట్టంలో ఉన్న నియమాలను పాటించని ఆ దేశస్తులకు జైలు శిక్ష నుండి భారీ జరిమానా విధించడం జరిగుతుందని తెలుస్తోంది.ప్రతి ఒక్కరు కూడా స్థానిక పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు అన్ని విధాలుగా వారికి వారు ఆరోగ్యంగా ఉండేందుకు పరిశుభ్రతను పాటిస్తారు.అందుకే అక్కడ కరోనా భయం కూడా ఇప్పటి వరకు లేదు.

ఇంత శుభ్రంగా ఉంటే కరోనా ఏంటీ దాన్ని అమ్మమ్మ కూడా రాదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇంతటి పరిశుభ్రతను పాటించే రువాండా దేశం గురించి ప్రస్తుతం నెటిజన్స్‌ తెగ వెదికేస్తున్నారు.

అక్కడ అమలు అవుతున్న చట్టం ఉముగాండా గురించి కూడా పలు దేశాలు అధ్యయనం చేస్తున్నాయి.ప్రతి దేశం కూడా ఉముగాండా చట్టంను తీసుకు రావాలి.లేదంటే రాబోయే 50.100 ఏళ్లలో ఈ భూమి ఉంటుందో ఉండదో అనే డౌట్‌ వస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube