రాజ్యాంగంలో కీలక మార్పులకు పూనుకున్న పుతిన్

వివాహ వ్యవస్థకు సంబంధించి రాజ్యాంగంలో కీలక మార్పులు తీసుకురావాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భావిస్తున్నారు.వివాహ వ్యవస్థ కు సంబంధించి వివాహం అంటే స్త్రీ-పురుషుల ఏకత్వమే అన్న భావనను రాజ్యాంగంలో పొందుపరచాలని పుతిన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

 Russias Putin Wants Traditional Marriage And God In Constitution-TeluguStop.com

దీనితో సవరించిన రాజ్యాంగంలో సమ లైంగికుల వివాహం అన్న ప్రస్తావన లేకుండా చేయాలనే పుతిన్ భావిస్తున్నట్లు సమాచారం.వాటితో పాటు రాజ్యంగంలో దేవుని ప్రస్తావన, రష్యా భూభాగాన్ని దారదత్తం చెయ్యడం వంటి వారిపై కూడా నిషేధం వంటి మరిన్ని సవరణలను కూడా రాజ్యాంగంలో పొందుపరచాలని పుతిన్ భావిస్తున్నారు.

అయితే పుతిన్ ప్రతిపాదనలపై త్వరలోనే పబ్లిక్ ఓటింగ్ కూడా జరగనున్నట్లు సమాచారం.అయితే 2024 తర్వాత ఇక రాజకీయాల్లో కొనసాగను అంటూ చెప్పిన పుతిన్ ఇప్పుడు ఈ కీలక నిర్ణయాలతో 2024 తర్వాత కూడా అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకునేందుకే ఈ సవరణల ప్రతిపాదన తీసుకొచ్చారని భావిస్తున్నారు విమర్శకులు.

ప్రముఖ నటుడు, దర్శకుడు, నూతన రాజ్యాంగ రూపకల్పనలో పాలుపంచుకుంటున్న వ్లాదిమిర్ మాష్కోవ్ చెప్పిన ప్రకారం… భూభాగానికి సంబంధించి తీసుకొచ్చిన సవరణ ప్రధాన ఉద్ధేశం 2014లో రష్యా మిలటరీ ఆక్రమించిన క్రైమియాపై అలాగే కురిల్ ద్వీపంపై తమ పట్టును పెంచుకోవడమే.కురిల్ ద్వీపానికి సంబంధించి రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి నుంచి రష్యా-జపాన్‌ దేశాల మధ్య ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది.

అధ్యక్షుడి నుంచి కొన్ని అధికారాలను పార్లమెంటుకు బదలాయించాలన్న ప్రతిపాదనలతో పాటు రాజ్యాంగాన్ని సవరించాలంటూ ఆయన గత జనవరిలోనే ప్రతిపాదన తీసుకువచ్చారు.నిజానికి రాజ్యాంగ సవరణపై ఏప్రిల్ 22న పబ్లిక్ ఓటింగ్ జరగాల్సి ఉంది.

అయితే అంత కన్నా ముందు అది పార్లమెంట్ నుంచి అలాగే రాజ్యాంగ న్యాయస్థానం నుంచి ఆమోదం పొందాల్సి ఉంది.

Telugu Putin, Russia, Russiasputin, Telugu Nri, Traditional-Telugu NRI

అయితే ఈ రాజ్యాంగ సంస్కరణ బిల్లును రష్యా పార్లమెంట్ దిగువ సభ ది స్టేట్ ఆఫ్ డ్యూమా జనవరిలోనే ఆమోదించగా,ఇక పుతిన్ ప్రతిపాదనలపై వచ్చే వారం ఎగువ సభలో చర్చించనున్నారు.రష్యా పార్లమెంట్‌లో పుతిన్ వర్గానిదే ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ బిల్లు ఆమోదం అయ్యే అవకాశాలు ఉన్నాయి.మరోపక్క పుతిన్ తీసుకొస్తున్న తాజా సవరణలపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

మెజార్టీ రష్యన్లకు పుతిన్ అద్దం పడతారని కొందరు అంటుండగా, మరి కొందరు మాత్రం ఈ సవరణలు అసందర్భమైనవని, రాజకీయ పరమైనవని అంటూ కొట్టిపారేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube