ఇదేం పిచ్చిరా బాబు: 100 మంది పిల్లలను కనడమే మా టార్గెట్ అంటున్న జంట..!

పిల్లల మీద ఇష్టంతో ఓ దంపతులు వంద మందిని కనే ఏర్పాట్లు చేస్తున్నారు.వందమందిని కనేసి పెంచేసుకోవాలని తెగ సంబరపడిపోతున్నారు.

 Russian Woman Christina Ozturk Target 100 Babies Through Surrogacy , 100 Members-TeluguStop.com

అందుకోసం వారు సరోగసీ అంటే అద్దె గర్భాన్ని ఆశ్రయించారు.అలా ఇప్పటికే 20 మంది పిల్లలను కనేశారు.

వినడానికి ఆశ్చర్యంగానే కాదు, విన్నవాళ్ళకు పిచ్చి ఎక్కించే లాంటి విషయం ఇది.ఎందుకంటే, ఓ ఇద్దరు ముగ్గురు పిల్లలనే పెంచలేక అవస్థలు పడుతున్న ఈరోజుల్లో ఇప్పటికే 20 మంది పిల్లలను పెంచుతూ ఇంకో 80 మందిని పెంచాలని అనుకుంటున్నారు.సరిగ్గా 12 నెలల క్రితం ఈ రోజు, క్రిస్టినా (28) కేవలం ఒక కుమార్తెకు తల్లి.కానీ ఇప్పుడు ఆమె 21 మందికి తల్లి.ఆమెకు సర్రోగసీ ద్వారా 20 మంది పిల్లలు కలిగారు.ప్రసవానికి మరొక మహిళ గర్భాన్ని అద్దెకు తీసుకోవడాన్ని సరగసీ అంటారు.

బటుమి (జార్జియా) లో నివసిస్తున్న క్రిస్టినా, ఆమె భర్త గలిప్ ఓజ్తుర్క్ 100 మంది పిల్లలు కావాలని కోరుకుంటారు.

వ్యాపారవేత్త అయిన గలిప్ ఇందుకోసం ఎంత ఖర్చైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడు.ఇప్పటివరకు ఇద్దరూ సర్రోగసీ కోసం సుమారు 1.5 కోట్లు ఖర్చు చేశారు.ఈ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవటానికి, అతను 16 నానీలను (ఆయా) ఇంటిలోనే ఉంచాడు.

Telugu Galip Ozturk, Moscow, Russian, Surrogacy, Target, Latest-Latest News - Te

వీటి కోసం సంవత్సరంలో సుమారు 70 లక్షల రూపాయలు ఖర్చు చేశారు.క్రిస్టినా రష్యాకు చెందినది.ఇప్పుడు వారి మూడు అంతస్థుల ఇంట్లో నాలుగు నుండి 14 నెలల వరకు పిల్లలు ఉన్నారు.

క్రిస్టినాకు మొదటి వివాహం ద్వారా ఆరేళ్ల కుమార్తె విక్టోరియా కూడా ఉంది.క్రిస్టినా తన భర్త గాలిప్‌ను జార్జియా పర్యటనలో మొదటిసారి కలిసింది.వారిద్దరూ కలిసి ఒక పెద్ద కుటుంబం గురించి కలలు కన్నారు.2020 లో వారి ఇంటికి వచ్చిన మొదటి బిడ్డ పేరు ముస్తఫా.గల్లిప్ తన మొదటి భార్య ద్వారా తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube