వామ్మో: ఆ పోలీస్ ఇంట్లో బంగారం టాయిలెట్..!

సొంతగా ఇల్లు కట్టుకుని ఆ ఇంటికి సరిపడా ఫర్నిచర్ కొనుక్కుని, మంచి ఇంటీరియర్ డిజైన్ తో ఇంటిని అలంకరించుకోవాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు.కానీ కొంతమంది కలలు నెరవేరతాయి.

 Golden Toilet In Russian Traffic Cop Home, Russian Traffic Cop ,golden Toilet, R-TeluguStop.com

మరి కొంతమంది కలలు కలలు గానే మిగిలిపోతాయి.అయితే కాసేపు కలలు గురించి పక్కన బెడితే.

ఒక వ్యక్తి తన ఇంటిలో ఏకంగా బంగారు ఆభరణాలతో ఒక బాత్ రూమ్ నే నిర్మించుకున్నాడు.దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అది ఇల్లు కాదు ఒక రాజభవనం అనడంలో అతిశయోక్తి లేదు అంటున్నారు.ఆ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు బంగారంతో చేసినవే.

ఇంతకీ ఆ వ్యక్తి చేసే ఉద్యోగం ఏంటో తెలుసా.? ట్రాఫిక్ పోలీస్ ఉద్యోగం.అతను ఒక ట్రాఫిక్ పోలీస్ గా విధులు నిర్వర్తిస్తూ ఇంత డబ్బులు సంపాందించాడంటే ఆశ్చర్యంగా ఉంది కదా.

Telugu Bribery, Cops, Gold, Golden Toilet, Goldentoilet, Bribe, Russian Cops, Ru

కానీ ఇది నిజం అసలు వివరాల్లోకి వెళితే.రష్యా ఇన్వెస్టిగేటర్స్ లంచం తీసుకున్నాడని అభియోగం రావడంతో దర్యాప్తులో భాగంగా ఒక ట్రాఫిక్ పోలీస్ అధికారిపై ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది.ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అతని గురించి ఎన్నో భయంకర నిజాలు బయట పడ్డాయి.

ఆ ట్రాఫిక్ పోలీస్ అధికారి పేరు కోల్ అలెక్సీ సాఫోనోవ్.దర్యాప్తులో భాగంగా కోల్ ఇంటిని అధికారులు సోదా చేయగా కళ్ళు చెదిరే దృశ్యాలు అతడి ఇంటిలో కనిపించాయి.ఏకంగా బంగారంతో టాయిలెట్లని నిర్మించాడు కోల్.ఇది చూసిన ఆఫీసర్స్ షాక్ అవుతున్నారు.ఒక్క టాయిలెట్స్ నే కాకుండా ఇల్లంతా బంగారంతో ఎంతో లగ్జరీగా అన్ని గదులని నిర్మించారు.అంత సంపాదన ఎలా వచ్చిందని ఆరా తీస్తే అతను వ్యాపారులకు నకిలీ అనుమతులు ఇస్తూ వాళ్ళ దగ్గర నుండి లంచాలు తీసుకునేవాడని తేలింది.

Telugu Bribery, Cops, Gold, Golden Toilet, Goldentoilet, Bribe, Russian Cops, Ru

అంతేకాకుండా ఈ ట్రాఫిక్ పోలీస్ ఒక మాఫియా ముఠాని కూడా నడిపిస్తున్నట్లు తెలిసి అతనిని ఉద్యోగం నుండి తొలగించారు.అతనికి ఇంటి గదులు, లోపల ఉన్న ఫర్నిచర్, బంగారు మరుగుదొడ్లు, అలంకరణలు, డబ్బు కట్టలు చూసి నేటిజన్లు షాక్ అవుతున్నారు.అతనికి సుమారు 19 మిలియన్ రూబిళ్ల ఆస్థి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.కోల్ మీద ఉన్న అభియోగాలు అన్నీ నిరూపణ అయ్యి అతను దోషిగా తేలితే మాత్రం సుమారు 8 నుండి 15 ఏళ్లు జైలుశిక్ష పడవచ్చట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube