వైరల్: గోల్డ్ మెడల్ తీసుకోవడానికి క్యాట్ ఫేస్ మాస్క్ ధరించి అందరిని ఆశ్చర్యపరిచిన అథ్లెట్..!

ప్రస్తుతం అందరి దృష్టి కూడా టోక్యో ఒలింపిక్స్ మీదనే ఉంది.ఏ దేశం ఎక్కువ మెడల్స్ గెలుస్తుందా అని ఎవరికీ వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Russian Swimmer Evgeny Rylov Wears Cat Face Mask To Receive Gold Medal In Tokyo-TeluguStop.com

ఇలా టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొనే అందరికి ప్రముఖులు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే.అలాగే ఈ పోటీలో ఆడుతున్న ప్లేయర్స్ కు సంబంధించి చాలా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఓ అథ్లెట్ పెట్టుకున్న మాస్క్ బాగా వైరల్ అవుతుంది.ఆ వివరాల్లోకి వెళితే.

రష్యాకు చెందిన 24 ఏళ్ల ఎవ్జెనీ రైలోవ్ అనే అథ్లెట్ స్విమ్మింగ్ పోటీల్లో 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్‌ లో గెలిచి గోల్డ్ మెడల్ పతాకాన్ని సాధించాడు.ఫైనల్‌ లో ఎవ్జెనీ రైలోవ్ తన దేశానికీ చెందిన క్లిమెంట్ కొలెస్నికోవ్‌ ను కేవలం 0.02 సెకన్ల తేడాతో ఓడించి ఫైనల్ లో విజేతగా నిలిచాడు.అయితే రైలోవ్ గోల్డ్ మెడల్ తీసుకునే సమయంలో ధరించిన ఫేస్ మాస్క్ అందరిని ఆశ్చర్య పరిచింది.

కరోనా వైరస్ ను కట్టడి చేసే క్రమంలో మాస్క్ తప్పనిసరి చేసారు అన్ని దేశాల ప్రతినిధులు.ఈ క్రమంలో మార్కెట్లోకి రకరకాల మాస్క్ లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.

Telugu Cat Face, Evgeny Rylov, Olym, Russian, Tokyo Olym, Latest, Wears Cat Face

ఈ నేపథ్యంలో రైలోవ్ కూడా ఒక విచిత్రమైన మాస్క్ ధరించాడు.ఆ మాస్క్ మీద పిల్లి బొమ్మ ఉండడం వలన వెరైటీ గా తలిపించింది.రైలోవ్ అలా క్యాట్ ఫేస్‌ మాస్క్‌ ధరించి గోల్డ్ మెడల్ తీసుకుంటున్న చిత్రాలు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి.అయితే ఎవ్జెనీ రైలోవ్ తనకి నచ్చిన క్యాట్ ఫేస్ మాస్క్ మెట్టుకుని గోల్డ్ మెడల్ అందుకోవడానికి మెడల్ సెరిమోనీ పోడియం వద్దకు రాగా అతని ఫేస్ మాస్క్ చూసి ఒలింపిక్స్ నిర్వాహకులు అభ్యంతరం తెలిపి, మరొక ఫేస్‌మాస్క్‌ వేసుకుని రమ్మని చెప్పారు.

కానీ.క్యాట్ ఫేస్ మాస్క్ తీసేయడానికి ఎవ్జెనీ రైలోవ్ నిరాకరించి ముఖంలో హావభావాలు మార్చేసి విచారంగా పెట్టాడు.అలా అని ఫేస్ మాస్క్ తీయను అని అంటే అప్పటిదాకా తాను సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు పోతాయి.

Telugu Cat Face, Evgeny Rylov, Olym, Russian, Tokyo Olym, Latest, Wears Cat Face

దాంతో తాను చేసేదేమీ లేక కొన్ని క్షణాల పాటు అలాగే ఉండిపోయాడు.కానీ., కొంత సమయం తర్వాత ఒలింపిక్స్ నిర్వాహకులు ఎవ్జెనీకి ఓకే చెప్పి క్యాట్ ఫేస్ మాస్క్ ధరించమని చెప్పడంతో అతని ఆనందానికి అవధులు లేవు.

తనకెంతో ఇష్టమైన క్యాట్ ప్రింట్ ఫేస్ మాస్క్ ధరించి గోల్డ్ మెడల్ తీసుకోవడానికి పోడియం వద్దకు చేరుకుని మెడల్ తీసుకుంటున్న క్రమంలో అతని మాస్క్ చూసి క్రీడా అభిమానులు అంతా షాక్ అయ్యారు.అదే ఫేస్‌ మాస్క్‌ ధరించి గోల్డ్ మెడల్ అందుకున్న ఫొటోలో, వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.

ఇలా ఉండగా అతనికి పిల్లులు అంటే బాగా ఇష్టం అంట.అతనికి ఆ క్యాట్ ఫేస్ మాస్క్ ను తన ప్రియురాలు బహుమతిగా ఇచ్చిందట.ఈమెకు కూడా పిల్లులంటే ఇష్టం అంట.వీరిరువురికి పిల్లుల మీద ఉన్న అభిమానంతో ఇలా పిల్లి బొమ్మ ఉన్నా ఫేస్ మాస్క్ ధరించారు.దీంతో ఇప్పుడు ఈ క్యాట్ ఫేస్ మాస్క్ నెటిజన్లను బాగా ఆకర్షిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube