గుడ్ న్యూస్: కరోనా కు విరుగుడు రెడీ అంటున్న రష్యా శాస్త్రవేత్తలు…!  

Russian Scientists, COVID-19, Corona Vaccine Trials, Russian Scientists Successfully Completed Corona Vaccine Trials - Telugu Corona Vaccine Trials, Covid-19, Russian Scientists, Russian Scientists Successfully Completed Corona Vaccine Trials

గత 5 నెలల నుండి ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఏ విధంగా గడగడలాడిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చైనా దేశంలో మొదలైన ఈ మహమ్మారి ప్రపంచం మొత్తం సోకి చాలా మందిని బలిగొంది.

 Russian Scientists Corona Vaccine Trials

అనేక మందిని రోడ్డు పాలు కూడా చేసింది.ఇక ఈ కరోనా మహమ్మారి కి విరుగుడు కనుక్కునేందుకు ప్రపంచం నలుమూలల ప్రతిదేశంలోనూ శాస్త్రవేత్తలు అహర్నిశలు కష్టపడుతూ ప్రయోగాలు చేస్తున్నారు.

ఇందులో ముఖ్యంగా అమెరికా, రష్యా, చైనా, భారత్, ఆస్ట్రేలియా లాంటి కొన్ని పెద్ద దేశాలు కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసే ముందంజ వేసి విజయం వైపు దూసుకు వస్తున్నాయి.

గుడ్ న్యూస్: కరోనా కు విరుగుడు రెడీ అంటున్న రష్యా శాస్త్రవేత్తలు…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇకపోతే తాజాగా మిగతా దేశాలతో పోలిస్తే రష్యా ఒక అడుగు ముందుకేసింది.

వారు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ పై క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ ఫుల్ గా పూర్తి అయ్యాయని రష్యాలోని సెచెనోవ్ విశ్వవిద్యాలయం తెలిపింది.ఇందుకు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ జూన్ 18న రష్యాకు చెందిన గమలీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన వాక్సిన్ ను మొదలు పెట్టింది.

తాజాగా వారు పరీక్షలు చేపట్టిన తొలి వాలంటీర్లుబృందం గత మూడు రోజుల నుండి డిశ్చార్జ్ అవుతున్నారని, అలాగే ఈ నెల 20 తారీకు కూడా రెండవ వాలంటీర్లు బృందం డిశ్చార్జ్ అవుతుందని యూనివర్సిటీ డైరెక్టర్ వాడిత్ తారాసోవ్ తెలియజేశారు.అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వ్యాక్సిన్లు కంటే ఈ వ్యాక్సిన్ భద్రత కు అనుగుణంగా ఉంటుందని యూనివర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ పారాసిటమాలజీ, ట్రాపికల్, వెక్ట్ బోర్న్ డిసీజెస్ డైరెక్టర్ అలెగ్జాండర్ లుకాషెవ్ తెలియజేశారు.ఏది ఏమైనా కరోనా కు యాంటీ డోస్ కనుగొనడం గొప్ప విజయం అని చెప్పవచ్చు.

#COVID-19

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Russian Scientists Corona Vaccine Trials Related Telugu News,Photos/Pics,Images..