విమానంలో పాడుపని చేసిన పైలట్.. కెమెరాలో అంతా రికార్డు

క్యాస్టింగ్ కౌచ్ అంశం ప్రపంచవ్యాప్తంగా సినీ రంగంలో మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపుల అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.చాలా మంది బాధితులు తాము ఎదుర్కొన్న అనుభవాలను ప్రపంచానికి తెలియజెప్పారు.

 Russian Pilot Fired After Caught With Trainee Student In Cockpit Details, Flight-TeluguStop.com

అవకాశాల కోసం ఎలా లోబర్చుకుంటారో బయటకు తెలిసింది.అయితే ఈ క్యాస్టింగ్ కౌచ్ ఒక్క సినీ రంగానికే కాదని, అన్ని రంగాలలోనూ ఉంటుందని పలువురు సినీ ప్రముఖులు గొంతెత్తారు.

తమనే నిందించొద్దని, ఆడపిల్లలను లొంగదీసుకునే సంస్కృతి అన్ని రంగాలలోనూ ఉంటుందని చెప్పారు.ఇదే కోవలో ఓ పైలట్ వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

రష్యాలో ఇటీవల ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.

ట్రైనింగ్ కోసం వచ్చిన ఓ యువతిని పురుష పైలట్ లైంగిక వేధింపులకు గురి చేశాడు.మొదట్లో అతడి కోరికను ఆమె నిరాకరించింది.

అయితే చివరికి ఆమెను తన దారికి తెచ్చుకున్నాడు.ఆమెను లోబర్చుకుని తన వాంఛ తీర్చుకున్నాడు.

అయితే ఇందుకు అతడు తాను పని చేసే విమానాన్నే వేదికగా ఎంచుకున్నాడు.విమానం కాక్‌పిట్‌లో సదరు యువతిని తీసుకెళ్లాడు.

విమానాన్ని ఆటోపైలట్ మోడ్‌లో పెట్టి, అక్కడ ఆమెతో శృంగారం చేశాడు.అయితే ఈ విషయం ఎవరికీ తెలియదని భావించాడు.

Telugu Trainee, Cockpit, Latest, Russian, Russian Pilot-Latest News - Telugu

వీరి వ్యవహారం మొత్తం అక్కడ కెమెరాలో రికార్డ్ అయింది.దానిని చూసిన ఉన్నతాధికారులు సదరు పైలట్‌పై వేటు వేశారు.విచారణలో తనకేమీ తెలియదని పైలట్ వ్యాఖ్యానించాడు.మహిళా ట్రైనీ పైలట్‌ను తాను కేవలం ముద్దు మాత్రమే పెట్టుకున్నానని బుకాయించాడు.అయితే అతడి భాగోతం మొత్తం కాక్‌పిట్ కెమెరాలో రికార్డ్ అయిందని అధికారులు చెప్పడంతో కంగుతిన్నాడు.ఆ ఏవియేషన్ స్కూల్ యాజమాన్యం పైలట్‌ను విధుల నుంచి తొలగించింది.

ట్రైనీగా జాయిన్ అయిన యువతిని శిక్షణకు రావొద్దని పంపించేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube