మిలటరీ కి కూడా పాకిన కరోనా, ఏకంగా 900 మందికి

ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న కరోనా మహమ్మారి కి ఇప్పటికే 2 లక్షల మందికిపైగా మృతి చెందగా,30 లక్షల మందికి పైగా కరోనా బారిన పడిన వారిలో ఉన్న సంగతి తెలిసిందే.చైనా,అమెరికా,ఇటలీ,స్పెయిన్,ఫ్రాన్స్ లలో విశ్వరూపం చూపిన ఈ మహమ్మారి ఇప్పుడు రష్యా లో తీవ్ర స్థాయిలో ఉంది.

 Corona Virus, China, America, Italy, Spain, France, Russia, Military, Parade, Ho-TeluguStop.com

రష్యా లో మిలటరీ కి ఈ మహమ్మారి సోకడం మరింత ఆందోళన కలిగిస్తుంది.అక్కడి మిలటరీలో ఇప్పటివరకు 874 కరోనా కేసులు నమోదయ్యాయి.వారిలో 379మంది హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.మిగిలినవారంతా వివిధ ప్రాంతాల్లోని మెడికల్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటనతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.మరో పక్క ఈ మహమ్మారి నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా విజయాన్ని పురస్కరించుకొని మే 9 న జరిగే మిలటరీ పెరేడ్ ను కూడా రద్దు చేస్తున్నట్లు పుతిన్ ప్రకటించారు.వాస్తవానికి ప్రతి సంవత్సరం జరిగే ఈ పరేడ్ లో 15 వేల మంది మిలటరీ బలగాలు పాల్గొంటారు.

అయితే ప్రస్తుతం మిలటరీ లో కూడా కరోనా కల్లోలం సృష్టిస్తుండడం తో అధ్యక్షుడు పుతిన్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

ఇలాంటి సమయంలో ఈ పరేడ్ ను నిర్వహించడం మంచిది కాదని పుతిన్ అభిప్రాయపడ్డారు.రష్యాలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు 80,949కు చేరుకున్నాయి.747 మంది మృతిచెందారు.అయితే ఈ మహమ్మారి మిలటరీ కి కూడా పాకడం తో అధికారులు ఆందోళన చెందుతున్నారు.ఈ మహమ్మారి ని ఎలా కట్టడి చేయాలా అని అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube