సముద్ర దేవతని గుర్తించిన రష్యా శాస్త్రవేత్త

మనం జీవిస్తున్న ఈ ప్రపంచంలో 75 వేల కోట్ల జీవరాశులు ఉన్నాయని మన మన పురాణాలు చెబుతున్నాయి.అయితే మన కంటికి కనిపించేవి మాత్రం వందల సంఖ్యలోనే ఉంటాయి.

 Russian Marine Biologist Clicks Pictures Of A Sea Angel, Sea Angels-TeluguStop.com

ఇక కంటికి కనిపించని అతి సూక్షం జీవులతో పాటు సముద్రంలో కొన్ని వేల కోట్ల జీవరాశులు ఆవాసంగా చేసుకొని జీవనం సాగిస్తున్నాయి.అప్పుడప్పుడు వాటిలో అరుదైన జీవులు కనిపిస్తూ ఉంటాయి.

అవి కూడా కొన్ని సముద్రాలలోనే కనిపిస్తాయి.తాజాగా అలాంటి అరుదైన సముద్ర జీవిని రష్యాకి చెందిన సముద్ర జీవులపై అధ్యయనం చేసే శాస్త్రవేత్త గుర్తించారు.

ఈ జీవి విచిత్రమైన ఆకారంతో అతనిని ఆశ్చర్యపరిచింది.దీంతో సముద్రంలో దానిని ఫోటోని తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అది కాస్తా ఇప్పుడు వైరల్ అయ్యింది.

అలెగ్జాండర్ సెమెనోవ్ అనే శాస్త్రవేత్త వెన్నెముక లేని జీవజాలంపై స్పెషలైజేషన్ చేశాడు.

మాస్కో స్టేట్ యూనివర్సిటీకి చెందిన వైట్ సీ బయోలాజికల్ స్టేషన్ డైవర్ల బృందానికి నాయకుడుగా ఉన్నాడు. సముద్రాల్లో ప్రతికూల పరిస్థితుల్లో సైతం పరిశోధనలు సాగించే సెమెనోవ్ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ గా సముద్ర జీవుల ఫోటోలు తీస్తూ ఉంటాడు.

రష్యాలోని తెల్ల సముద్రంలో మంచు ఫలకాల అడుగుభాగాన ఓ అద్భుతమైన జీవిని సెమెనోవ్ క్లిక్ మనిపించాడు. సముద్ర దేవతగా అభివర్ణించే ఈ జీవిని అత్యున్నత నాణ్యతతో ఫొటో తీశాడు.

ఆ ఫొటోలను తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా పంచుకున్నాడు.సముద్ర దేవతలు ఎంతో అందమైనవే అయినా, అంతుచిక్కని జీవులని పేర్కొన్నాడు.

న్యూరో బయాలజీలో ఎక్కువగా అధ్యయనం చేసే వీటిని టెరోపోడ్ మోలుస్క్ అని పిలుస్తారని తెలిపాడు. అయితే వాటి జీవితచక్రం గురించి తెలిసింది చాలా తక్కువ అని సెమెనోవ్ పేర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube