కండల కోసం అడ్డదారి తొక్కాడు.. ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు

తెలుగు సినిమాల్లో కామెడీ పండించేందుకు అలీ, అల్లరి నరేష్‌లు తమ కండలను ఉన్నఫలంగా పెంచిన తీరు ప్రేక్షకులను కుడుపుబ్బా నవ్వించింది.అయితే ఇలాంటి ప్రయోగం నిజజీవితంలో సాధ్యం కాదని మనకు తెలిసిందే.

 Russian Inserts Chemicals To Get More Biceps-TeluguStop.com

కానీ ఓ యువకుడు అదే ఫార్ములాను నిజజీవితంలో ఫాలో అయ్యాడు.దీంతో అతడి కండలు అమాంతం పెరిగిపోయాయి.

అంతేగాక ఈ ప్రయోగం అతడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది.

Telugu Biceps, Chemicals, International, Russian, Weird-

రష్యాకు చెందిన 23 ఏళ్ల బాడీ బిల్డర్ కిరిల్ తెరేషిన్ తన కండరాలు పెద్దగా కనిపించేందుకు అడ్డదారిలో వాటికి పెట్రోలియం జెల్లీని ఎక్కించాడు.అయితే ఇది అతడి ప్రాణాల మీదకు వచ్చింది.దీంతో అతడి నకిలీ కండను తొలగించకపోతే అతడి ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్లు తెలిపారు.

అతడి చేతులు పడిపోయి ప్రాణాప్రాయ స్థితికి చేరుకునే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.కాగా దాదాపు రెండు గంటలపాటు శ్రమించిన వైద్యులు కిరిల్ కండరాలను తొలగించారు.

Telugu Biceps, Chemicals, International, Russian, Weird-

ఇంకా అతడి కండరాలకు కొన్ని సర్జరీలు చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు.ఏదేమైనా కండలు పెంచాలని చూసిన కిరిల్‌కు కాస్తలో దండ పడేదని నెటిజన్లు అతడిని విమర్శిస్తున్నారు.కండలు రావాలంటే కష్టపడాలి కానీ ఇలా అడ్డదారిలో తెచ్చుకుంటే ప్రాణాలు గాలిలో కలవడం ఖాయమని వారు హితవు పలుకుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube