ఆకాశవాణి ప్రసారాలు... ఎక్కడి నుంచి అనేది రహస్యం

ఒకప్పుడు టీవీ కంటే ముందుగా రేడియో ప్రసారాలు ఉండేవి.ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం లేదా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అనే మాటలు చాలా మంది గతంలో విని ఉంటారు.

 Russian Ghost Radio Station Uvb-76, Russia, Akashavani, Radio Station, Ghost Rad-TeluguStop.com

ఒక రేడియో స్టేషన్ నుంచి ఫ్రీక్వెన్సీ ద్వారా ఈ ప్రసారాలు టెలికాస్ట్ అవుతూ ఉంటాయి.ఇప్పుడు ఈ రేడియో స్టేషన్ లో కూడా రకరకాల ఎఫ్ఎం స్టేషన్ లు ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ ఉన్నాయి.

స్మార్ట్ ఫోన్ రాకముందు వీటికి మంచి డిమాండ్ ఉండేది.అయితే వీటిని వినేవారి సంఖ్య కూడా ఈ మధ్యకాలంలో గణనీయంగా తగ్గిపోయారు.

రేడియో స్టేషన్ ఏదైనా, దానికో పేరు ఉంటుంది.ఎక్కడి నుంచి ప్రసారం అవుతుంది అనేది కూడా కచ్చితమైన అడ్రెస్ ఉంటుంది.

అయితే రష్యాలోని ఒక రేడియో స్టేషన్ దాదాపు 40 ఏళ్ళుగా ఎలాంటి పేరు లేకుండా, ఎక్కడి నుంచి ప్రసారం అవుతుందో కూడా తెలియకుండా అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.
దీని నుంచి ఇరవై నాలుగు గంటలూ సిగ్నల్స్‌ వెలువడుతూనే ఉంటాయి.

రేడియో సెట్లు, ట్రాన్సిస్టర్లలో ఈ స్టేషన్‌ను ట్యూన్‌ చేస్తే, ఆగి ఆగి నిమిషానికి 25 సార్లు ఒక విచిత్రమైన ధ్వని వస్తూ ఉంటుంది.అప్పుడప్పుడు ఎవరో ఒకరి గొంతు నుంచి ప్రత్యక్ష ప్రసారాలు కూడా వెలువడుతూ ఉంటాయి.

దీనిని ఎవరు నడుపుతున్నదీ ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు.తొలిసారిగా దీని ఉనికిని 1982లో జనాలు తెలుసుకున్నారు.

అప్పటి నుంచి గమనిస్తున్నా, ఏనాడూ దీని నుంచి వెలువడే విచిత్రమైన ధ్వనికి, అప్పుడప్పుడు వెలువడే ప్రసారాలకుగాని ఏమాత్రం అంతరాయం కలగలేదు.వారానికి రెండు మూడుసార్లు ఈ రేడియో స్టేషన్‌ నుంచి వ్యవసాయ నిపుణుల సలహాలు, పశువుల పెంపకం వంటి కార్యక్రమాలు కూడా ప్రసారమవుతూ ఉంటాయి.

అయితే ఈ రేడియో స్టేషన్ ప్రసారాలు ప్రజలు వింటున్న దాని పేరు మాత్రం వారికి ఇప్పటి వరకు తెలియక పోవడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube