వండర్‌ : చనిపోయిందని భావించి, మట్టిలో పూడ్చిన కుక్క మళ్లీ వచ్చింది.. నమ్మలేని నిజం  

Russian Dead Dog Return Home-return Home,russian Dead Dog,రష్యా కుక్క

కొన్ని కళ్లముందు జరిగిన విషయాలను మనం నమ్మలేం. ఎందుకంటే అలా జరుగుతాయని మనం ఊహించం కనుక. జరుగని విషయాలు ఎప్పుడైనా జరిగితే వాటిని అద్బుతాలు అంటారు..

వండర్‌ : చనిపోయిందని భావించి, మట్టిలో పూడ్చిన కుక్క మళ్లీ వచ్చింది.. నమ్మలేని నిజం-Russian Dead Dog Return Home

అంటే చనిపోయిన మనుషులు లేదా జంతువులు తిరిగి జీవిస్తే అది నిజంగా అద్బుతంగా పరిగణిస్తారు. చనిపోయ్యిందని తెలిసి ఒక జంతువును భూమిలో పాతి పెట్టిన తర్వాత మళ్లీ అది బయటకు వస్తే అది చాలా మంది నమ్మరు. దెయ్యం అని కూడా కొందరు భయపడతారు.

మన దేశంలో అయితే పూడ్చి పెట్టిన తర్వాత మళ్లీ వస్తే దాన్ని చంపేసి మరీ పూడ్చి పెట్టే మూర్ఖులు ఉంటారు. కాని ఈ సంఘటన రష్యాలో జరగడం వల్ల ఆ కుక్కను అలా చేయలేదు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… రష్యాలోని ఒక చిన్న ఏరియాలో నివాసం ఉండే కుటుంబం గత 15 ఏళ్లుగా డిక్‌ అనే కుక్కను పెంచుకుంటున్నారు. ఆ కుక్క ఆ ఇంటి వారితో చాలా కలిసి పోయింది.

ఆ కుటుంబం ఎక్కడకు వెళ్తే అక్కడకు వెళ్లడంతో పాటు, రాత్రి సమయంలో ఇంటికి రక్షణగా ఉండేది. అలా డిక్‌ ఆ కుటుంబంలో ఒక మనిషిగా వ్యక్తిగా మారిపోయింది. అద్బుతమైన బాండింగ్‌తో కలిసి పోతున్న ఆ ఫ్యామిలీ మరియు కుక్క జీవితంలో అనూహ్యమైన కుదుపు.

ఒక రోజు కుక్క పడుకుంది. దాన్ని ఎంత లేపినా కూడా లేవలేదు. దాని శ్వాస కూడా ఆడుతున్నట్లుగా అనిపించలేదు.

దాంతో డిక్‌ చనిపోయిందని భావించారు.

డిక్‌ మరణంతో ఆ కుటుంబ సభ్యులు అంతా కూడా శోక సంద్రంలో మునిగారు. కొద్ది సమయం విచారించిన తర్వాత ఆ కుక్కను స్మశానవాటికలో పూడ్చి చెట్టారు. ఏం జరిగిందో ఏమో కాని ఆ కుక్క మట్టి తోడుకుని బయటకు వచ్చింది.

కుక్క మట్టితో బయటకు రావడంను చూసిన జంతు సంరక్షణ వారు దాన్ని తమ వద్దకు తీసుకు వెళ్లి శుబ్రపర్చి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ పోస్ట్‌ డిక్‌ యజమానులకు చేరింది. వెంటనే వారి వద్దకు వెళ్లి తమ కుక్కను తీసుకు వచ్చారు..

తమ కుక్కను కాపాడినందుకు వారికి ఆర్థికంగా కూడా సాయం చేయడం జరిగింది. తమ కుక్క బతికే ఉన్నందుకు వారి ఆనందంకు అవదులు లేవు. కుటుంబం మొత్తం పండగ చేసుకున్నారు.

ఇదో అద్బుతంగా రష్యా వ్యాప్తంగా ప్రచారం జరిగింది.