రష్యా, ఉక్రెయిన్ మధ్య వార్.. ధ్వంసమైన భారీ డ్యామ్

రష్యా, ఉక్రెయిన్ మధ్య భారీ యుద్దం జరుగుతోంది.కొద్ది నెలలుగా ఈ భీకర యుద్దం కొనసాగుతూనే ఉంది.

 Russia-ukraine War Kakhovka Dam Destroyed In Attack Details, War, Russia, Ukrain-TeluguStop.com

రెండు దేశాలు అసలు వెనక్కి తగ్గడం లేదు.పరస్పరం ఆపకుండా దాడులు చేసుకుంటుండటంతో యుద్దం అలాగే కొనసాగుతోంది.

యుద్దం ఆపేందుకు చాలా దేశాలు ప్రయత్నాలు చేసినా, శాంతిని నెలకొల్పాలని అనేక అంతర్జాతీయ సంస్థలు సూచించినా.ఉక్రెయిన్, రష్యా( Russia Ukraine War ) మాత్రం అసలు వెనక్కి తగ్గడం లేదు.

ప్రతీకారం తీర్చుకునేందుకు యుద్దాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నాయి.

Telugu Dam Destroyed, Dam, International, Kakhovkadam, Latest, Putin, Russia, Uk

ఈ క్రమంలో తాజాగా ఉక్రెయిన్‌లోని అతిపెద్ద నోవా కభోక్కా డ్యామ్‌పై( Nova Kakhovka Dam ) రష్యా దాడి చేసింది.ఈ దాడిలో డ్యామ్ పూర్తిగా ధ్వంసమైంది.దక్షిణ ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతంలో ఈ డ్యామ్ ఉంది.

ఈ డ్యామ్‌పై బాంబులు వేయడంతో కుప్పకూలిపోయింది.దీంతో డ్యామ్‌లోని నీళ్లన్నీ లోతట్టు ప్రాంతాలకు చేరుతుండటం ప్రమాదకరంగా మారింది.

అయితే ఈ డ్యామ్‌ ధ్వంసంపై ఉక్రెయిన్, రష్యా మధ్య మాటల యుద్దం జరుగుతోంది.ఈ డ్యామ్‌ను రష్యా బాంబులతో పేల్చిందని ఉక్రెయిన్ ఆరోపిస్తుండగా.

ఇది ఉక్రెయిన్ల పనేనంటూ రష్యా ఆరోపిస్తోంది.

Telugu Dam Destroyed, Dam, International, Kakhovkadam, Latest, Putin, Russia, Uk

డ్యామ్ పేలిపోయి నీళ్లు చుట్టుపక్కల ప్రాంతాలకు చేరుకోవడంతో స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.డ్యామ్ ను ( Dam ) ఒక్కసారిగా కూల్చేయడం, నీళ్లు చేరుంకుటుండటంతో పెను విపత్తు సంభవించే అవకాశముందని చెబుతున్నారు.నిప్రో నదిపై ఈ డ్యామ్ ఉండగా.

సోవియట్ కాలంలో దీనిని నిర్మించారు.జూన్ 2న ఈ డ్యామ్ ధ్వంసమైనట్లు ఉపగ్రహ ఛాయచిత్రాల్లో కనిపిస్తుండగా.

జూన్ 6 తర్వాత నీటి ప్రవాహంలో ఎలాంటి మార్పు లేదు.జూన్ 6న విడుదల అయిన వీడియోల్లో డ్యామ్ గోడలు విరిగిపోవడం, పక్కనున్న భావనాలు కూలిపోవడం లాంటివి కనిపించాయి.

అయితే డ్యామ్ పూర్తిగా దెబ్బతినడం వల్ల ఎనిమిది గ్రామాల ప్రజలకు ముప్పు వాటిల్లింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube