కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఉక్రెయిన్‌లోని భారతీయులకు అలర్ట్

ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌లో భాగమైన ఉక్రెయిన్‌ కేంద్రంగా ప్రస్తుతం ఐరోపాలో యుద్ధ వాతావరణం నెలకొంది.ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమించబోతోందని, ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రకటించవచ్చని రెండు నెలలుగా అమెరికా, బ్రిటన్‌ సహా నాటో కూటమి ఆరోపణలు చేస్తోంది.

 Russia-ukraine Crisis: India Asks Citizens In Kyiv To Register For Coordination,-TeluguStop.com

అయితే గడిచిన వారం రోజులుగా ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది.ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో 1,20,000 మంది సైనికులను రష్యా మోహరించిందని.

అదే జరిగితే కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా సారథ్యంలోని నాటో కూటమి రష్యాను హెచ్చరిస్తోంది.కానీ రష్యా ఈ ఆరోపణలను తోసిపుచ్చుతోంది.

ఉక్రయిన్‌ను దురాక్రమించాలని తమకు లేదని పుతిన్ చెబుతున్నా.క్రిమియా విషయంలో ఆయన చేసినదానిని అమెరికా గుర్తుచేస్తోంది.

అనేక కీలకమైన రక్షణ రంగ పరిశ్రమలు, క్షిపణి తయారీ వ్యవస్థలు, ఖనిజ సంపదతో వున్న ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా రష్యాకు అత్యంత కీలకం.అది తనవైపున ఉంటే రష్యా మరింత బలంగా ఉంటుందని పుతిన్ అభిప్రాయం.

ఉక్రెయిన్ జనాభాలో దాదాపు ఐదోవంతు మంది రష్యన్లే.ఆ దేశ తూర్పు ప్రాంతం చారిత్రకంగా, సాంస్కృతికంగా రష్యాకు చాలా దగ్గర.

క్రిమియా విషయంలో పుతిన్ దూకుడును నిలువరించలేకపోయిన నాటో ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గేదేలే అంటోంది.మొత్తంమ్మీద అటు అమెరికా జెట్‌లు, యుద్ధనౌకలు.

.ఇటు సరిహద్దుల్లో రష్యా సేనల మోహరింపుతో ఉక్రెయిన్‌ ముప్పు ముంగిట వుంది.

మరోవైపు ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఉన్నందున అక్కడి తన రాయబార కార్యాలయ సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేస్తూ వస్తోంది.పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, ఉక్రెయిన్‌లోని భారత పౌరులంతా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ల కోసం ఎంబసీ అధికారిక వెబ్‌సైట్‌, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను తప్పనిసరిగా ఫాలో అవ్వాలని కోరింది.దానితో పాటు తమ క్షేమ సమాచారాల్ని ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లోని ఫామ్‌లలో అప్‌డేట్‌ చేయాలంటూ భారత పౌరులకు కేంద్రం విజ్ఞప్తి చేసింది.

ఏమైనా సాయం కావాలంటే సోషల్‌ మీడియాలోనూ సంప్రదించవచ్చని భారత ప్రభుత్వం సూచించింది.

Russia-Ukraine Crisis: India Asks Citizens In Kyiv To Register For Coordination, Russia-Ukraine, America, Britain‌, Indian Students, Soviet Union, American Jets, Warships - Telugu America, American Jets, Britain, Indian, Russia Ukraine, Russiaukraine, Soviet, Warships

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube