తెలంగాణా రాష్ట్రానికి రష్యా దేశానికి చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు వచ్చాయి.శనివారం సాయంత్రం వ్యాక్సిన్ కంటైనర్లు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి.
రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ జీ.ఎం.ఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో ద్వారా మొదటి ప్రధాన కంటైన్మెంట్ పంపించారు.ప్రముఖ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ప్రత్యేక చార్టెడ్ ఫైటర్ విమానంలో రష్యా నుండి ఈ వ్యాక్సిన్లను తెప్పించడం జరిగింది.
ఈ విమానం సాయంత్రం 4:05 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయంకు చేరుకుంది.
స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ను మైనస్ 20 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది.
దీనికోసం జి.హెచ్.ఏ.సి డాక్టర్ రెడ్డీస్ సప్లై చైన్ మేనేజ్ మెంట్ తో పాటుగా కస్టంస్ విభాగం, ఎయిర్ కార్గో కు చెందిన మేనేజ్ మెంట్ కలిసి పనిచేస్తుంది.స్పుత్నిక్ వి కన్ సైన్మెంట్ అనుకున్న విధంగా నిర్వహించడానికి హైదరాబాద్ ఎయిర్ కార్గో టెర్మినల్ వద్ద కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నారు.రష్యా నుండి 7.5 టన్నుల వ్యాక్సిన్ తెలంగాణాకు చేరుకుంది.ఇవి లక్షా 50 వేల డోసుల వ్యాక్సిన్ తయారవుతుందని తెలుస్తుంది.
స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఎప్పటి నుండి ప్రజలకు అందుబాటులో ఉంటుంది అన్నది తెలియాల్సి ఉంది.ప్రస్తుతానికి కొవిషీల్డ్, కొవాక్సిన్ లు మాత్రమే ప్రజలకు అందిస్తున్నారు.