దేవుడా.. ఆ నది ఏంటి అలా మారిపోయింది..?!

ప్రపంచంలో ఎక్కడైనా సరే నీళ్లు ఏ రంగులో ఉంటాయి.తెలుపు రంగులో ఉంటాయి కదా.

 River In Russia Changed To Red Color, Locals Horrified, Social Media, Toxic Wate-TeluguStop.com

మహా అయితే వరద వచ్చినపుడు కాస్త మట్టితో కలిసి గోధుమరంగులోకి నీరు కనపడతాయి.లేకపోతే అవి పూర్తిగా తెలుపు వర్ణంలో ని మనకు కంటికి కనపడతాయి.

అయితే కొన్ని దేశాల్లో మాత్రం సాధారణంగా నదిలో ఉండే నీరు అప్పుడప్పుడు కొన్ని రంగులు మారుతూ ఉండడం మనం వార్తల్లో వింటూనే ఉంటాము.తాజాగా ఇలాంటిదే ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది.

రష్యా దేశంలోని ఉన్న ఓ నదిలో స్వచ్ఛమైన మంచినీరు కాస్త ఎరుపు రంగులోకి మారడం ప్రస్తుతం అక్కడ ఆందోళన కలిగిస్తోంది.నీరు అలా మారడంతో స్థానిక ప్రజల ఆరోగ్యానికి ప్రమాదంగా మారింది అంటూ కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆ ప్రాంతంలోని నీరు రంగు మారడానికి గల కారణం ఆ ప్రాంతంలో కాలుష్యం కారణం అయి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.రష్యా లోని ఇష్కిటింకా నదిలో నీరు బీట్రూట్ కలర్ లోకి మారడంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు.

అయితే అక్కడ ఉన్న స్థానిక మీడియా మాత్రం ఆ నదిలో ఏదో విషపూరితమైన వాయువు ప్రవేశించడం ద్వారా నీలి రంగులో ప్రవహించే నది కాస్త ఎరుపు రంగులోకి మారిందని తెలుస్తోంది.నదిలోని నీళ్ళు రంగు మారి కనిపించడంతో ఆ ప్రాంతంలో ఉన్న పారిశ్రామిక వాసులు ఆశ్చర్యపోతున్నారు.

అయితే నదిలో నీరు రంగు మారడానికి గల కారణాలపై అక్కడి అధికారులు కొన్ని పరిశోధనలు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ నది కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారడంతో విషయం కాస్త ప్రపంచం నలుమూలల తెలిసిపోయింది.

ఈ ప్రాంతానికి డిప్యూటీ గవర్నర్ గా ఉన్న వ్యక్తి మాట్లాడుతూ రంగు మారడానికి దోహదపడిన కాలుష్యం గురించి తెలుసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.ఆ నది రంగు మారడానికి గల ఈ విషయాన్ని తెలుసుకుని దానికి ఎవరైతే కారకులో వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

అయితే నదిలో సంచరించే జల చెరులు మాత్రం అన్ని సురక్షితంగా ఉన్నాయని అక్కడి స్థానికులు తెలుపుతున్నారు.అక్కడి స్థానికులు ఈ నదిని ఎప్పుడు ఇలా తాము చూడలేదని వాపోతున్నారు.

ఇకపోతే కేవలం రష్యాలో ఈ ఒక్క ప్రాంతమే కాదు మరో నది కూడా ఇలాగే రంగులు మారిన దాఖలాలు ఉన్నాయి.అయితే నదీ ప్రాంతాల్లో ఉండే పరిశ్రమల నుండి వెలువడే రసాయనాల కారణాల వల్లే ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయని అధికారులు తెలుపుతున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూడండి ఈ నది బీట్ రూట్ ఎరుపు లోకి ఎలా మారిందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube