మోడీని వరించిన రష్యా అత్యున్నత పురష్కారం

ఓ వైపు భారత్ లో ప్రాంతీయ పార్టీలు, విపక్షాలు అన్ని మోడీ నియంత అని, హిట్లర్ తరహా పాలనని ఇండియాలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడని తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటే ప్రపంచ దేశాలు మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి.అలాగే తమ దేశాలలో ఉన్న అత్యున్నత పురష్కారాలతో సత్కరిస్తున్నాయి.

 Russia Awards Pm Narendra Modi With Highest State Honour-TeluguStop.com

కొద్ది రోజుల కృతమ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన అత్యున్నత పౌరపురష్కారం మోడీని ప్రకటించింది.

ఇదిలా ఉంటే తాజాగా భారత్‌, రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి కృషి చేసినందుకు ప్రధాని మోడీని ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్థర్‌ ఆఫ్‌ సెయింట్‌ అండ్రూ ద అపోస్టల్‌’తో రష్యా సత్కరించనుంది.

ఈ అవార్డుకు ఆమోదం తెలుపుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ సంతకంతో కూడిన డిక్రీలను ఆ దేశ రాయబార కార్యాలయం ట్వీట్‌ చేసింది.రష్యాతో భారత్ సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో చెప్పడానికి మోడీకి వచ్చిన ఈ అవార్డు నిదర్శనం అని బీజేపీ పార్టీ నేతలు ప్రశంసిస్తూ ఉన్నారు.

ఇదిలా ఉంటే ఈ నెలలో అంతర్జాతీయ పౌర పురస్కారాలు ప్రధాని మోడీ అందుకోవడం ఇది రెండవసారి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube