ప్రిస్క్రిప్షన్‌ డ్రగ్‌ను ఆమోదించిన రష్యా..!

కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు రష్యా ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి సారిగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చి రిజిస్టర్ చేసుకున్న రష్యా ఇప్పుడు ఫార్మసీలో ప్రిస్ర్కిప్షన్ డ్రగ్ ను అమ్మేందుకు రెడీ అవుతోంది.

 Russia, Approves, Prescription Drug,corona-TeluguStop.com

ఫార్మసీలో కరోనా నియంత్రణకు సంబంధించి ప్రిస్క్రిప్షన్ డ్రగ్ ను అమ్మేందుకు రష్యా ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది.రష్యాకు చెందిన ఆర్ ఫార్మ్ సంస్థ అభివృద్ధి చేసిన ‘కరోనావిర్’ ఔషధాన్ని మార్కెట్ లో తీసుకురానుంది.

చికిత్సలో భాగంగా ‘కరోనావిర్’ ఔషధాన్ని స్వల్ప, మధ్యస్థ లక్షణాలున్న కరోనా బాధితులకు అందిస్తారు.ఇప్పటికే మూడో దశల్లో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేస్తున్న కరోనావిర్ ఔషధ పంపిణీకి ఆమోదం లభించిందని ఆర్ ఫార్మ్ సంస్థ వెల్లడించింది.

దేశంలోని అన్ని ఫార్మా కంపెనీల్లో వారం రోజుల్లోగా ‘కరోనావిర్’ అందుబాటులోకి వస్తుందని సంస్థ తెలిపింది.కరోనావిర్ డ్రగ్ ఆమోదంతో అవిఫావిర్ అనే డ్రగ్ కు ఎలాంటి అడ్డంగులు లేకుండా ఉంది.

జపాన్ తయారు చేసిన అవిఫావిర్ డ్రగ్ ఆధారంగా ఈ రెండు ఔషధాలను తయారు చేశారు.కరోనాపై పోరాడుతూ అన్ని దేశాలకంటే ముందంజలో ఉండాలని రష్యా ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే రష్యా కరోనా పరీక్షా కిట్లను చాలా దేశాలను ఎగుమతి చేస్తోంది.రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ సరఫరా కోసం అనేక అంతర్జాతీయ ఒప్పందాలను కూడా చేసుకుంది.

క్లినికల్ ట్రయల్స్ ముగిసిన తర్వాత వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రష్యా పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube