ఈ వీడియో చూస్తే ఒళ్లు జలదరిస్తుంది.. ఏకంగా 33 విష పాములు..  

Russell\'s viper Gives Birth to 33 Snakelets, Coimbatore zoo, Russell\'s viper, Zoo - Telugu 33 Snakelets, Coimbatore Zoo, Russell\\'s Viper, Russell\\'s Viper Gives Birth To 33 Snakelets, Snake, Zoo

సాధారణంగా పాములు గుడ్లు పెడతాయనే సంగతి అందరికీ తెలిసిందే.కానీ పాములలో రక్తపింజర పాము మాత్రం ప్రత్యేకం.

 Russells Viper Gives Birth To 33 Snakelets

అన్ని పాములు గుడ్లు పెడితే ఈ పాము మాత్రం పిల్లలను కంటుంది.అయితే సాధారణంగా రక్త పింజర పాము ఒక ఈతలో పది నుంచి పదిహేను పాము పిల్లలను కంటుంది.

కానీ తమిళనాడులోని ఒక పాము మాత్రం ఒకే ఈతలో ఏకంగా 33 పాము పిల్లలను కనింది.వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా 33 పాము పిల్లలను కన్న ఘటన సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూస్తే ఒళ్లు జలదరిస్తుంది.. ఏకంగా 33 విష పాములు..-General-Telugu-Telugu Tollywood Photo Image

పూర్తి వివరాలోకి వెళితే తమిళనాడులోని కోయంబత్తూరులోని వీవోసీ జంతు ప్రదర్శనశాలలో రక్త పింజర పాము ఒక ఈతలో 33 పిల్లలను పెట్టటంతో అధికారులు సైతం ఆశ్చర్యపోయారు.జూ అధికారులు మీడియాతో మాట్లాడుతూ ఒక ఈతలో 33 పిల్లలను కనడం అత్యంత అరుదుగా జరుగుతుందని చెబుతున్నారు.

అనైకట్టీ అటవీ ప్రాంతంలో 33 పాము పిల్లలను విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు జూ అధికారులు చెబుతున్నారు.
గతంలో ఇదే జాతికి చెందిన పాము ఒకటి 60 పిల్లలకు జన్మనిచ్చిందని సమాచారం.

ర‌స్సెల్స్ వైప‌ర్ జాతికి చెందిన ఈ పామును రెండు నెలల క్రితం ఒక వ్యక్తి తన ఇంటి బాత్ రూంలో చూశాడు.కంగారు పడిన ఆ వ్యక్తి జూ అధికారులకు పాము గురించి సమాచారం ఇచ్చాడు.

ఆ పాము ఇప్పుడు 33 పిల్లలకు జన్మనిచ్చి వార్తల్లో నిలిచింది.సోషల్ మీడియాలో పాము పిల్లలకు సంబంధించిన ఫోటోలను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

#Snake #Russell's Viper #Russell'sViper #Coimbatore Zoo #33 Snakelets

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Russells Viper Gives Birth To 33 Snakelets Related Telugu News,Photos/Pics,Images..