రస్సెల్ కండ బలానికి పని చెప్పాలి.. లేదంటే..!  

sehwag, andre russel, muscle strength, ipl, kkr, sunil narine, morgan, pat cummins, kkr vs chennai - Telugu Andre Russel, Ipl, Kkr, Kkr Vs Chennai, Morgan, Muscle Strength, Pat Cummins, Sehwag, Sunil Narine

దుబాయ్: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో విండీస్ విద్వంసకర వీరుడు ఆండ్రీ రస్సెల్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కోలకతా నైట్ రైడర్స్ జట్టు తరఫున సత్తా చాటాల్సి ఉండగా, భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అతని ఫామ్ ఫై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

TeluguStop.com - Russel Need To Show His Muscle Strength

టోర్నీ ప్రారంభమై 20రోజులు గడుస్తున్నా రస్సెల్ తన కండ బలానికి పని చెప్పకపోవడం ఫై అతను పెదవి విరిచాడు.

రస్సెల్ ట్రాక్ రికార్డ్ ను పరిశీలిస్తే అతను ఎంత విధ్వంసకర ఆటగాడో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.తాను ఎదుర్కొనే ప్రతి బంతిని స్టాండ్స్ దాటించడంలో దిట్ట అయిన రస్సెల్.

TeluguStop.com - రస్సెల్ కండ బలానికి పని చెప్పాలి.. లేదంటే..-Sports News క్రీడలు-Telugu Tollywood Photo Image

ఈ ఐపీఎల్ లో మాత్రం తన కండలకు పని చెప్పడం లేదని వీరూ తెగ బాధ పడిపోతున్నాడు.పొట్టి క్రికెట్ లో అత్యంత ప్రమాదకర క్రికెటర్లలో ఒకడైన రస్సెల్ ఇకనైనా తన సత్తా చాటకపోతే, కోలకతా జట్టు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అతను హెచ్చరిస్తున్నాడు.

నేడు చెన్నైతో జరుగనున్న మ్యాచ్ నేపథ్యంలో వీరూ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.పనిలో పనిగా అతను మరో విండీస్ ఆటగాడు, కోలకతా ఓపెనింగ్ బ్యాటర్ సునీల్ నరైన్, ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ గురించి కూడా ప్రస్తావించాడు.

కోలకతా కెప్టెన్ దినేష్ కార్తీక్ వీరి సేవలను సరైన రీతిలో వినియోగించుకుంటే వారి జట్టు ప్లే ఆఫ్ బెర్త్ ను ఖరారు చేసుకోవడం ఖాయం అని వీరూ అభిప్రాయపడుతున్నాడు.కాగా వీరూ ఇటీవలే చెన్నై జట్టు ను డీజిల్ ఇంజిన్ తో పోల్చిన సంగతి తెలిసిందే.

.

#Andre Russel #Morgan #Sunil Narine #Pat Cummins #Sehwag

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు