అభిజిత్ ను టార్గెట్ చేస్తున్న బిగ్ బాస్.. కారణమిదే..?  

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 4లో అభిజిత్ బిగ్ బాస్ విన్నర్ అవుతాడని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ సైతం అభిజిత్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని మొదట్లో కామెంట్లు వ్యక్తమయ్యాయి.

TeluguStop.com - Rumours Viral Social Media About Bigg Boss Team Targeting Abhijeet

కానీ గడిచిన 4 రోజుల నుంచి బిగ్ బాస్ షోను చూస్తుంటే అభిజిత్ ను బిగ్ బాస్ టార్గెట్ చేశాడా.? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం బిగ్ బాస్ అభిజిత్ ను టార్గెట్ చేస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు.

శనివారం రోజు ఎపిసోడ్ లో నాగార్జున అభిజిత్ పై సీరియస్ అయ్యాడు.

TeluguStop.com - అభిజిత్ ను టార్గెట్ చేస్తున్న బిగ్ బాస్.. కారణమిదే..-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో ఏకంగా నాగార్జుననే అభిజిత్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు.అయితే అభిజిత్ బయట పెయిడ్ ఆర్మీలను క్రియేట్ చేసుకున్నాడని అందువల్లే ఎలిమినేషన్ నుంచి అభిజిత్ సేవ్ అవుతూ వస్తున్నాడని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యాయి.

బిగ్ బాస్ షోలో ఇప్పటివరకు పదిసార్లు నామినేట్ అయిన అభిజిత్ నామినేట్ అయిన ప్రతిసారి సేఫ్ అవుతూ వస్తున్నారు.

అభిజిత్ నిజంగా పెయిడ్ ఆర్మీల ద్వారా విన్ అయితే భవిష్యత్తు సీజన్లలో కూడా కంటెస్టెంట్లు పెయిడ్ ఆర్మీల ద్వారా ఓట్లు వేయించుకునే అవకాశాలు ఉన్నాయి.గతంలో ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ పెయిడ్ ఆర్మీల ద్వారానే విన్నర్ గా నిలిచాడని కామెంట్లు వినిపించాయి.అందువల్లే బిగ్ బాస్ నిర్వాహకులు అభిజిత్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అభిజిత్ ను నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

అయితే బిగ్ బాస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అభిజిత్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ సీజన్ లో పెద్దగా గుర్తింపు ఉన్న కంటెస్టెంట్లు పాల్గొనకపోవడం, హౌస్ లో సొహైల్ మినహా అభిజిత్ కు గట్టి పోటీ ఇచ్చే కంటెస్టెంట్ లేకపోవడం గమనార్హం.

అయితే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు ఇంకా 20 రోజుల సమయం ఉండటంతో అభిజిత్ కు బదులుగా మరొకరు విన్నర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బిగ్ బాస్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

#Bigg Boss Team #Grand Finale #Paid Armiles

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rumours Viral Social Media About Bigg Boss Team Targeting Abhijeet Related Telugu News,Photos/Pics,Images..