అలాంటి పాత్రలో ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు పూనకాలే..?  

కొన్నేళ్ల క్రితం వరుస ఫ్లాపులతో కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్న జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుంచి నవ్యత ఉన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు.సినిమాసినిమాకు కలెక్షన్ల పరంగా కొత్త రికార్డ్ లను క్రియేట్ చేస్తూ ఎన్టీఆర్ తన మార్కెట్ ను పెంచుకుంటున్నారు.

TeluguStop.com - Rumours Viral About Prashant Neel Junior Ntr Next Movie

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు.

కేజీఎఫ్ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించే సినిమా పీరియాడికల్ సినిమా అని సమాచారం.

TeluguStop.com - అలాంటి పాత్రలో ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు పూనకాలే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని పాకిస్తాన్ ఇండియా విడిపోయిన కాలం నాటి పరిస్థితులను ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్నారని ఎన్టీఆర్ యోధుడిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది.భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 250 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం.

Telugu 1920 Year, Kgf Director, Ntr Role In Prashant Neel Movie, Pak India War Story-Movie

ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగిన సమయంలో భారత్ గెలుపు కోసం శ్రమించిన తీరును దర్శకుడు ప్రశాంత్ నీల్ కళ్లకు కట్టినట్టుగా చూపించనున్నారని తెలుస్తోంది.సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే విధంగా ఉంటుందని ఈ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరుగుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.కేజీఎఫ్ 2 సినిమా విడుదలైన తరువాత ఈ సినిమా షూటింగ్ పనులు మొదలు కానున్నాయని సమాచారం.

జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ సినిమాలో కూడా నటించనున్నాడని 2022 సంవత్సరంలో ఫస్ట్ హాఫ్ లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా విడుదల కానుందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్లతో వరుసగా సినిమాలకు కమిటవుతూ కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

#1920 Year #KGF Director #NtrRole #PakIndia

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు