బిగ్‌బాస్‌.. ఎన్టీఆర్‌ : పుకార్లకు హద్దు పద్దు లేకుండా పోయింది  

Rumours On Big Boss Telugu 2 About Jr Ntr-

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో టైటిల్‌ విజేత ఎవరు అంటూ చర్చ జరుగుతుంది.అంతా కూడా బిగ్‌ బాస్‌ విజేత కౌశల్‌ అంటూ నమ్మకంగా చెబుతున్నారు.ఇక షో ఫైనల్‌ ఎపిసోడ్‌లో ఒక స్టార్‌ గెస్ట్‌ హాజరు కాబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.మా టీవీ మాజీ భాగస్వామి అయిన నాగార్జున ఈ షో ఫైనల్‌ ఎపిసోడ్‌లో ప్రత్యేక గెస్ట్‌గా రాబోతున్నాడు అంటూ నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది..

Rumours On Big Boss Telugu 2 About Jr Ntr--Rumours On Big Boss Telugu 2 About Jr NTR-

కాని ఇప్పుడు నాగార్జున కాదు, ఎన్టీఆర్‌ రాబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

బిగ్‌ బాస్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌కు ఎన్టీఆర్‌ వస్తే రచ్చ రచ్చ అంటూ ప్రేక్షకులు భావిస్తున్నారు.భారీ ఎత్తున టీఆర్పీ రేటింగ్‌ వచ్చే అవకాశం ఉంది.మొదటి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన ఎన్టీఆర్‌ ఈ రెండవ సీజన్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌లో పాల్గొంటే షో స్థాయి అమాంతం పెరిగినట్లే అంటూ అంతా భావిస్తున్నారు.

అయితే ఇవన్నీ కేవలం పుకార్లే అని, తండ్రి చనిపోయిన బాధలో ఉన్న ఎన్టీఆర్‌ తన సినిమా అరవింద సమేత ఆడియో వేడుకను కూడా క్యాన్సిల్‌ చేయించాడు.ఇప్పుడు ఈ షోలో ఎలా పాల్గొంటాడు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు..

సోషల్‌ మీడియాలో కొందరు అభిమానుల మరియు మరికొందరు ఇలాంటి పుకార్లను క్రియేట్‌ చేస్తున్నారు.

ఏది తోస్తే అది పుకారుగా క్రియేట్‌ చేయడం జనాల మీదకు వదలడం ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో కొందరికి అలవాటు అయ్యింది.నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 ఫైనల్‌ ఎపిసోడ్‌లో ప్రత్యేక గెస్ట్‌ పాల్గొనక పోవచ్చు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

మొదటి సీజన్‌కు ప్రత్యేక గెస్ట్‌ ఎవరు లేకుండానే విజేతను ఎన్టీఆర్‌ ప్రకటించిన విషయం తెల్సిందే.అదే విధంగా ఇప్పుడు నాని స్వయంగా విజేతను ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.వచ్చే వారంతో బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 ముగియబోతుంది.ఇప్పటికే ఇంట్లో ఆరుగురు సభ్యులు ఉన్నారు.

ఆ ఆరుగురు సభ్యుల్లో ఈ వారం ఒకరు లేదా ఇద్దరు ఎలిమినేట్‌ అవ్వబోతున్నారు.