టాలీవుడ్ కు దూరమవుతున్న పూజా హెగ్డే.. ఏమైందంటే..?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు తెచ్చుకున్నారు.టాలీవుడ్ నంబర్ 1 హీరోయిన్ రేసులో ఉన్న పూజా హెగ్డే నటించిన మూడు సినిమాలు ఈ ఏడాది విడుదలవుతున్నాయి.

 Rumours Goes Viral About Tollywood Star Heroine Pooja Hegde-TeluguStop.com

మే నెలలో ఆచార్య విడుదల కానుండగా జూన్ నెలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, జులై నెలలో పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్ సినిమాలు విడుదల కాబోతున్నాయి.
వరుసగా మూడు నెలల్లో పూజా హెగ్డే నటించిన మూడు సినిమాలు విడుదలవుతూ ఉండటం గమనార్హం.

అయితే ఈ మూడు సినిమాల తరువాత పూజా హెగ్డే ఏ సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడలేదు.తమిళ, హిందీ భాషల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న పూజా హెగ్డే తెలుగులో కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదా.? లేక దర్శకనిర్మాతలు పూజాహెగ్డేను సంప్రదించడం లేదా.? అనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది.

 Rumours Goes Viral About Tollywood Star Heroine Pooja Hegde-టాలీవుడ్ కు దూరమవుతున్న పూజా హెగ్డే.. ఏమైందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందం, అభినయం ఉన్న పూజా హెగ్డే టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి నటించారు.కొన్ని కొత్త ప్రాజెక్ట్ లలో పూజా హెగ్డే పేరు వినిపిస్తున్నా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.టాలీవుడ్ టాప్ హీరోయిన్లైన పూజా హెగ్డే, రష్మిక బాలీవుడ్ బాట పట్టడంతో వీళ్లు తెలుగు తెరకు దూరమవుతున్నారా.? అనే ప్రశ్నలు వ్యక్తమవుతాయి.మరోవైపు ఉప్పెన సినిమాతో సక్సెస్ సాధించిన కృతిశెట్టికి వరుస ఆఫర్లు వస్తున్నాయి.

సీనియర్ హీరోయిన్ల హవా తగ్గడంతో పూజాహెగ్డే, రష్మికలకు అవకాశాలు వచ్చాయి.

కానీ గోల్డెన్ లెగ్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే, రష్మిక టాలీవుడ్ కు దూరమైతే మాత్రం కొత్త ప్రాజెక్టులకు హీరోయిన్ల ఎంపిక కష్టమవుతుందని చెప్పవచ్చు.పూజా హెగ్డే కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

#Pooja Hegde #New Projects #RumorsGoes #MostEligible #Krithi Shetty

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు