అలాంటి క్లైమాక్స్ తో ఆర్ఆర్ఆర్.. ఫ్యాన్స్ అంగీకరిస్తారా..?

తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు ఇతర రాష్ట్రాల ప్రేక్షకులు సైతం ఈ ఏడాది విడుదల కాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా చరణ్, ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా ఆర్ఆర్ఆర్ నిలుస్తుందని ఇద్దరు హీరోల ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 Rumours Goes Viral About Rrr Movie Climax , Anti Climax, Fans Response, Ntr, Ram-TeluguStop.com

తాజాగా దర్శకుడు రాజమౌళి ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించారు.

దసరా పండుగకు ఆర్ఆర్ఆర్ సినిమాను కచ్చితంగా విడుదల చేయాలని భావిస్తున్న రాజమౌళి శరవేగంగా రెస్ట్ తీసుకోకుండా షూటింగ్ పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది.

సాధారణంగా రాజమౌళి సినిమాలలో హ్యాపీ ఎండింగ్ ఉంటుందనే సంగతి తెలిసిందే.కానీ ఆర్ఆర్ఆర్ సినిమా క్లైమాక్స్ మాత్రం విభిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది.గత నెలలో విడుదలైన ఉప్పెన సినిమాలా ఆర్ఆర్ఆర్ సినిమాకు నెగిటివ్ క్లైమాక్స్ ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది.

Telugu Climax, Fans Response, Ram Charan, Rrr-Movie

క్లైమాక్స్ లో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ ఒక కాలును కోల్పోతాడని అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న చరణ్ కళ్లు కోల్పోతాడని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.అయితే కాళ్లు, కళ్లు లేకపోయినా ఈ హీరోలు ఒకరికి మరొకరు సహాయం చేసుకుని శత్రువులపై పోరాడి విజయం సాధిస్తారని తెలుస్తోంది.అయితే ఆర్ఆర్ఆర్ గురించి వైరల్ అవుతున్న ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

స్టార్ హీరోల సినిమా నెగిటివ్ క్లైమాక్స్ తో తెరకెక్కితే ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉంటాయి.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీలో భారీ ట్విస్టులు, అంచనాలకు అందని ఆసక్తికర సన్నివేశాలు ఉండేలా ప్లాన్ చేశారని సమాచారం.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube