బన్నీ కొరటాల శివ మూవీ కథ ఇదేనా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప సినిమాలో పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే విడుదలైన టీజర్ పుష్ప సినిమాపై భారీగా అంచనాలను పెంచింది.

 Rumours Goes Viral About Bunny Koratala Shiva Movie-TeluguStop.com

ఊరనాటుగా తొలిసారి అల్లు అర్జున్ నటిస్తుండటంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా తరువాత బన్నీ కొరటాల శివ ప్రాజెక్ట్ మొదలు కావాల్సి ఉన్నా ఎన్టీఆర్ కొరటాల శివతో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తాత్కాలికంగా ఈ ప్రాజెక్ట్ వాయిదా పడింది.

2022 సంవత్సరం మే నెల నుంచి బన్నీ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కనుందని సమాచారం.ఈ సినిమా కథకు సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ వైరల్ అవుతోంది.

 Rumours Goes Viral About Bunny Koratala Shiva Movie-బన్నీ కొరటాల శివ మూవీ కథ ఇదేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వైరల్ అవుతున్న వార్త ప్రకారం యువ సినిమా కథను ఈ సినిమా పోలి ఉంటుందని తెలుస్తోంది.స్టూడెంట్స్ పాలిటిక్స్ ప్రధానంగా పాన్ ఇండియా అప్పీల్ తో ఈ సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది.

మార్కెట్ ను పెంచుకోవాలనే ఉద్దేశంతో టాలీవుడ్ స్టార్ హీరోలంతా పాన్ ఇండియా కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.నిర్మాతలు సైతం పాన్ ఇండియా కథలకు 150 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయలకు చేరడం గమనార్హం.గీతా ఆర్ట్స్ తో పాటు యువసుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఉంటాయి.కొరటాల శివ ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లనే సంగతి తెలిసిందే.

మరోవైపు కొరటాల శివ బన్నీ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ ప్రచారం జరుగుతుండగా కొరటాల శివ లేదా బన్నీ ఈ వార్తలపై స్పందించి స్పష్టతనిస్తారేమో చూడాల్సి ఉంది.పుష్ప సినిమా తరువాత బన్నీ ఐకాన్ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.

#Bunny #Koratala Shiva #Pushpa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు