ఝుమ్మంధి నాథం సినిమాతో వెండితెరకు పరిచయమైన సొట్ట బుగ్గల సుందరి తాప్సి పన్ను టాలీవుడ్ లో అంతగా క్లిక్కవ్వకపోయినా బాలీవుడ్ లో మాత్రం వరుస సక్సెస్ లు అందుకుంటోంది.సినిమా తేడా కొట్టినా కూడా అమ్మడి నటనకు మంచి మార్కులే పడుతున్నాయి.
దీంతో ఆఫర్స్ కూడా గ్యాప్ లేకుండా అందుతున్నాయి.నెక్స్ట్ మిషిన్ మంగల్ సినిమాతో కూడా సక్సెస్ కొట్టేలా ఉన్నట్లు టాక్ వస్తోంది.ఇక రెమ్యునరేషన్ విషయంలో కూడా బేబీ ఏ మాత్రం తగ్గడం లేదని టాక్.మొన్నటివరకు 2.5 కోట్లకు ఉన్న తాప్సి లెక్క ఇప్పుడు మూడున్నర కోట్లను దాటినట్లు సమాచారం.
ఇక మిషిన్ మంగళ సక్సెస్ ని బట్టి ఆ ఎమౌంట్ 4కోట్లని కూడా దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గత కొన్నాళ్లుగా బేబీ లక్కు మాములుగా లేదు.వరుస సక్సెస్ లు రావడంతో నిర్మాతలు కూడా తాప్సి డిమాండ్ కి తగ్గట్టు పేమెంట్స్ ఇస్తున్నారట.
మరి మిషిన్ మంగల్ అమ్మడికి ఎలాంటి సక్సెస్ ని ఇస్తుందో చూడాలి.