త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంటూ మొదలైన పుకార్లు...అసలు నిజం ఇదే?

Rumors That Telangana Cabinet Expansion Will Start Soon Is This The Real Truth

తెలంగాణ రాజకీయాలు రోజుకో సంచలనంతో ఒక్కసారిగా ఆసక్తిని రేపుతున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి నెలకొన్న తరుణంలో ఇక త్వరలో మంత్రి వర్గ విస్తరణ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పుకార్లు మొదలైన పరిస్థితి ఉంది.

 Rumors That Telangana Cabinet Expansion Will Start Soon Is This The Real Truth-TeluguStop.com

అయితే ఇప్పటికే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుపొందిన కవితకు త్వరలో అమాత్య యోగం కలగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్తల పట్ల ఇటు కవిత కాని, టీఆర్ఎస్ వర్గాలు కాని అధికారికంగా స్పందించకపోయినా టీఆర్ఎస్ పార్టీ వర్గాలలో చర్చ జరుగుతున్న మాట వాస్తవం.

Telugu @cm_kcr, @trspartyonline, Mlc Kavitha, Telangana-Political

అయితే కవిత మంత్రి వర్గంలోకి ప్రవేశిస్తే ఏ మంత్రిపై వేటు పడుతుందో అని పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.కొంచెం వాస్తవిక విషయాలను పరిశీలిస్తే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత తగ్గించుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.ఎందుకంటే ప్రతిపక్షాలు గతంలో ఎన్నడూ లేనంత రీతిలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలనే ఆలోచనతో పెద్ద ఎత్తున దూకుడు ప్రదర్శిస్తున్న పరిస్థితి ఉంది.ఈ సమయంలో కుటుంబ పాలన అంటూ ప్రతిపక్షాలు ప్రజల్లోకి పెద్ద ఎత్తున ప్రచారాన్ని తీసుకెళ్తున్న తరుణంలో కవితకు మంత్రి పదవి అవకాశం ఇస్తే ప్రతిపక్షాలకు టీఆర్ఎస్ ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టు అవుతుంది.

 Rumors That Telangana Cabinet Expansion Will Start Soon Is This The Real Truth-త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంటూ మొదలైన పుకార్లు…అసలు నిజం ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ప్రతిపక్షాల విమర్శలను పరిగణలోకి తీసుకోకపోతే కవితకు మంత్రి పదవి ఖాయం.  ఎమ్మెల్సీ కవితకు మంత్రి పదవి కల్పించడానికి ముఖ్య కారణం ఏంటంటే నిజామాబాద్ లో తమ ప్రాబల్యాన్ని తిరిగి పెంచుకోవాలంటే ఖచ్చితంగా మంత్రిగా ఉంటే తప్ప బలపడడానికి అవకాశం ఉండని పరిస్థితి ఉంటుంది.

ఏది ఏమైనా పుకార్లు పుకార్లుగా మిగులుతాయా నిజరూపం దాలుస్తాయా అనేది చూడాల్సి ఉంది.

#@CM_KCR #@trspartyonline #Mlc Kavitha #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube