పూజా హెగ్దే పై ఈ వార్తల్లో నిజమెంత..?

బుట్ట బొమ్మ పూజా హెగ్దే టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస క్రేజీ సినిమాలు చేస్తూ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.టాలీవుడ్ లో అయితే పూజా హెగ్దే హవా ఓ రేంజ్ లో కొనసాగుతుంది.

 Rumors On Pooja Hegde Behaviour On Sets , Rumors On Pooja Hegde , Behaviour On S-TeluguStop.com

స్టార్ హీరో సినిమా అంటే చాలు ముందు పూజా హెగ్దే డేట్స్ కోసం ట్రై చేస్తున్నారు.ఆమె కుదరకపోతేనే ఆ ఛాన్స్ వేరే వాళ్లకి ఇస్తున్నారు.

తెలుగుతో పాటుగా తమిళ, హిందీ భాషల్లో పూజా హెగ్దే ఫుల్ ఫాం కొనసాగిస్తుంది.అంతేకాదు అమ్మడు రెమ్యునరేషన్ కూడా భారీగా డిమాండ్ చేస్తుందని టాక్.

ఇదిలాఉంటే ఈ క్రేజ్.ఫాలోయింగ్ అమ్మడి తలకు ఎక్కించుకుందని అంటున్నారు.

పూజా హెగ్దే ఈమధ్య కొద్దిగా అతి చేస్తుందని టాక్.షూటింగ్ కు కూడా లేట్ గా వస్తుందని చెప్పుకుంటున్నారు.

అయితే ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియదు కాని పూజా హెగ్దే పై ఈ రూమర్ వైరల్ గా మారింది.ప్రస్తుతం పూజా హెగ్దే ప్రభాస్ రాధే శ్యాం, అఖిల్ బ్యాచిలర్ సినిమాలతో పాటుగా తమిళంలో విజయ్ బీస్ట్, త్రివిక్రం.

మహేష్ కాంబో సినిమాలో కూడా నటిస్తుంది.రాధే శ్యాం సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తుండటంతో ఆ సినిమా తర్వాత పూజా హెగ్దేకి బాలీవుడ్ లో కూడా వరుస క్రేజీ ఆఫర్లు వచ్చే ఛాన్సులు ఉన్నాయని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube