కరోనాతో ఆ హీరోయిన్ చనిపోయిందంటూ వార్తలు.. నెట్టింట వైరల్!

ప్రస్తుతం దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ తో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.రోజుకు లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతున్న తరుణంలో.

 Rumors On Meenaksh Seshadri-TeluguStop.com

ప్రతిరోజు ఎన్నో మరణ వార్తలు వింటున్నాం.సరైన వైద్య సదుపాయాలు అంద లేక ఎంతోమంది కరోనా పేషెంట్ లు ప్రాణాలు విడుస్తున్నారు.

మొదటగా సినీ ఇండస్ట్రీల నుండే వ్యాపించిన కరోనా వైరస్.ఇప్పుడు దేశమంతా వ్యాపించింది.

 Rumors On Meenaksh Seshadri-కరోనాతో ఆ హీరోయిన్ చనిపోయిందంటూ వార్తలు.. నెట్టింట వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక సినీ ఇండస్ట్రీలలో ఎంతోమంది నటీనటులు, దర్శక నిర్మాతలు ఇలా ఎంతో మంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన బృందాలు వైరస్ బారిన పడుతున్నారు.

ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో కొందరు దర్శక నిర్మాతలు, కొందరు ఆర్టిస్టులు మరణిస్తూనే ఉన్నారు.

రోజురోజుకు సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళ నుండి కోవిడ్ పాజిటివ్ అని.అంతేకాకుండా ఎవరో ఒకరు మరణిస్తున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి.ఇదిలా ఉంటే కొందరు బతికున్న హీరోయిన్ ను చనిపోయిందని పుకార్లు చేశారు.అంతేకాకుండా సోషల్ మీడియాలో చాలామంది నిజం అనుకొని.షాక్ అయ్యారు.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి.ఆమె ఇక లేరని, కరోనా బారినపడి మరణించిందని తాజాగా సోషల్ మీడియాలో కొందరు కావాలని సృష్టించారు.ఇక ఇది చూసిన తన అభిమానులు షాక్ అవ్వడంతో.సోషల్ మీడియాలో తన పట్ల బాగా ఎమోషనల్ అవుతూ.

తెగ పోస్టులు పెట్టారు.ఇక ఈ వార్తను చూసిన తన సన్నిహితులు ఇదంతా అబద్ధం అని, అలాంటిదేం లేదని, ఆమె బాగున్నారని స్పందించారు.

ఇక దీంతో తన అభిమానులు షాక్ నుండి కోలుకున్నారు.ఇలా తప్పుడు వార్తలు రాస్తున్న వాళ్ళ పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె సన్నిహితులు హెచ్చరించారు.

#Rumors #Corona

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు