500, 1000 కొత్త నోట్లు - అపోహలు, వాస్తవాలు

మొన్నటికి మొన్న, ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన ప్రధాని మోడీ, నిన్న అకస్మాతుగా బ్లాక్ మని పెద్దమనుషులపై సర్జికల్ స్ట్రయిక్స్ చేసారు.500 మరియు 2000 రూపాయలు నోట్లను బ్యాన్ చేస్తూ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు.ఇలా ఈ నిర్ణయం వెలువడిందో లేదో, కొన్ని పూకార్లు పుట్టుకొచ్చాయి.అందులో కొన్ని హాస్యాస్పందంగా ఉన్నాయి కూడా.కాబట్టి చదువుకున్నవారు, నిజాలని తెలుసుకోవడమే కాదు, చదువు రానివారికి సహాయపడండి.మీరు చదివిన సమాచారాన్ని వారికి అందించండి.

 Rumors And Facts About New 500 And 2000 Rupee Notes-TeluguStop.com

మొదటగా, రాబోతున్న 500 రూపాయల నోట్ల మీద ఎలాంటి ఎలక్ట్రానిక్ చిప్ ని కాని, జిపిఎస్ ట్రాకర్ ని కాని అమర్చడం లేదు.కొత్త 500 నోట్లు ఎలా ఉండబోతున్నాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టంగా చెప్పింది.66×166 మిల్లిమీటర్ల కొలతలతో ఉండబోతున్న ఈ నోట్లలో మహాత్మా గాంధీ, అశోక చక్రంతో పారు, రెడ్ ఫోర్ట్ ఉంటుంది.ఇక 2000 రూపాయల నోటు మీద NGC టెక్నాలజీ వాడారని వార్తలొస్తున్నాయి.

అయితే ఈ విషయంపై రిజర్వ్ బ్యాంకు ఇంకా స్పష్టతనివ్వలేదు.నిజాంగానే 2000 రూపాయల నోటుకి ట్రాకింగ్ లేయర్ ని అమర్చినట్లయితే, గవర్నమెంటుకి ఖర్చు తడిసిమోపెడవుతుంది.

మొత్తానికి 2000 రూపాయల నోటుపై ఇప్పుడే పూర్తిగా మాట్లాడలేం.

ఇక కొత్త నోట్లు రేపటి నుంచి అన్ని బ్యాంక్స్ లో లభిస్తాయి.

అలాగే 11వ తేదీనుంచి ATMs లో అందుబాటులోకి వస్తాయి.ఇంకా ఈ నోట్ల గురించి ఎలాంటి సమాచారం కావాలన్న 022 22602201/022 22602944 ఈ నంబర్లకు కాల్ చేయవచ్చు లేదా [email protected] కి ఈమెయిల్ చేయవచ్చు.

ప్రభుత్వ అధికారులు మీకు సమాధానమిస్తారు.

ఇక మీకు మరింతగా సహాయపడే సమాచారం ఈ పిక్చర్ లో ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube