అక్కడ బీజేపీకి షాక్ ఇచ్చిన డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఎన్నికల రిజల్ట్.. ?

తన పాలనకు ఎదురు లేదనే భావనలో ముందుకు సాగుతున్న కలం పార్టీకి ఈ మధ్య కాలంలో వరుసగా షాకులు తగులుతున్నాయి.దీనికి కారణం లేకపోలేదు.

 Ruling Bjp Handed Defeat In Tripura Tribal Council Polls-TeluguStop.com

మొదటి సారిగా ప్రధాని మోదీ నోట్ల రద్దు కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ప్రజలంతా దేశానికి, తమకు ఏదో ఉపయోగం ఉంటుందని ఆశించారు.కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

అయినా ఓపికతో ఉన్నారు.

 Ruling Bjp Handed Defeat In Tripura Tribal Council Polls-అక్కడ బీజేపీకి షాక్ ఇచ్చిన డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఎన్నికల రిజల్ట్.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ గత సంవత్సరం నుండి కరోనా సృష్టిస్తున్న విలయాన్ని ఎలాగైతే మరచిపోలేకున్నారో, ఈ సంవత్సరం మోదీ సృష్టించిన ధరల భారం కూడా అంతలా ప్రజల మనసుల్లో పాతుకు పోయిందని అర్ధం అవుతుంది.

దీని ఫలితంగా కమళం పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను ఎన్నికల్లో చూపిస్తున్నారు.

ఈ క్రమంలోనే త్రిపురలో బీజేపీకి షాక్ తగిలింది.

ఇందులో భాగంగా త్రిపుర ట్రైబల్ ఏరియాస్ అటనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఎన్నికల్లో కొత్తగా స్థాపించిన పార్టీ తిప్రాహా ఇండీజినస్ ప్రొగ్రెసివ్ రీజినల్ అలయెన్స్(తిప్రా) ఘన విజయం సాధించింది.కాగా బీజేపీ మిత్రపక్షం అయినా ఐపీఎఫ్‌టీ ఖాతా కూడా తెరవలేదు.

ఇదిలా ఉండగా మూడు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీపీఎంతో పాటు కాంగ్రెస్ కూడా ఒక్క సీటునూ గెలుచుకోలేకపోయింది.ఇక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒక స్థానంలో గెలుపొందగా, ఈ జిల్లాల్లోని 28 సీట్లకుగాను 18 సీట్లను తిప్రా గెలుపొందింది.

కాగా, బీజేపీ మాత్రం 9 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

#Tripura #Tribal #Ruling Bjp #Council Polls #Handed Defeat

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు