తులసి మాలను ధరిస్తున్నారా.. అయితే ఈ ఆహార పదార్థాలు తినకూడదు?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది.తులసి మొక్కను ఒక దైవ సమానంగా భావించి పూజలు చేస్తుంటారు.

 Rules Of Wearing Tulsi Mala And Its Importance-TeluguStop.com

కేవలం ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎంతో విరివిగా ఉపయోగిస్తారు.గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో తులసి ప్రాధాన్యత ఎంతో ఉంది.

తులసిని గ్రంథాలలో ఎంతో స్వచ్ఛమైనది, పవిత్రమైనదిగా భావిస్తారు.తులసి అంటే మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైంది.

 Rules Of Wearing Tulsi Mala And Its Importance-తులసి మాలను ధరిస్తున్నారా.. అయితే ఈ ఆహార పదార్థాలు తినకూడదు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మహావిష్ణు ఆలయాన్ని సందర్శించినప్పుడు తులసి మాలతో స్వామివారికి పూజించి నమస్కరించడం వల్ల స్వామివారు అనుగ్రహం మన పై కలిగి కోరిన కోరికలను నెరవేరుస్తాడు.తులసి లేనిదే విష్ణుపూజ అసంపూర్తిగా ఉంటుంది.

స్వామివారికి సమర్పించే తీర్థప్రసాదాలు లలో కూడా తులసిని ఉపయోగిస్తారు.ఈ విధంగా తులసి వేసిన తీర్థ ప్రసాదాలు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది తులసిమాలను చాలా మంది భక్తులు ధరిస్తారు.శివ భక్తులు రుద్రాక్షమాలను ధరిస్తే విష్ణు భక్తులు తులసి మాలను ధరిస్తారు.ఎంతో పవిత్రమైన తులసి మాలలను ధరించడం వల్ల మనసు ప్రశాంతత కలిగి ఉంటుంది.

Telugu Foods To Avoid, Importance, Maha Vishnu, Maha Vishnu Devotees, Maha Vishnu Pooja, Non Veg, Onions, Pooja, Telugu Bhakti, Tulasi Mala, Tulsi Mala Significance-Telugu Bhakthi

బుధ, గురు గ్రహాలను అనుగ్రహం మనపై కలిగి మరణించిన తర్వాత వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు.ఈ విధంగా ఎంతో పవిత్రంగా భావించే తులసి మాలలను ధరించే వారు తప్పకుండా కొన్ని నియమ నిష్టలను పాటించాలి.అయితే ఆ నియమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

* తులసి మాలలను ధరించే వారు ముందుగా మాలను గంగాజలంతో శుభ్రం చేసి ఆరిన తర్వాత మాత్రమే ధరించాలి.
*తులసి మాలను ధరించిన విష్ణుభక్తులు ప్రతిరోజు విష్ణుమూర్తి జపం చేయాల్సి ఉంటుంది.అప్పుడే స్వామి వారి అనుగ్రహం మనపై కలిగి మన కోరికలు నెరవేరుతాయి.
*తులసి మాలలు ధరించిన భక్తులు కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి.పొరపాటున కూడా వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసాహారం, చేపలు వంటి ఆహార పదార్థాలను తినకూడదు.

ఈ విధమైనటువంటి నియమాలను పాటిస్తూ తులసి మాలలను ధరించాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

#Pooja #TulsiMala #MahaVishnu #Importance #Onions

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU