కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ లో రూల్స్ చేంజ్

భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి కొత్త నిబంధనలకు ప్రభుత్వం ఓకే చెప్పింది.భారత వ్యాక్సిన్ అయిన ‘కొవాగ్జిన్’ క్లినికల్ ట్రయల్స్ నిబంధనలకు మార్పు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ అంగీకరించింది.

 Rules Change In Covaxin Clinical Trials, Bharath Bio Tech, Corona, Covaxin Vacci-TeluguStop.com

చర్మం కింది పొరకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతిని ఇచ్చినట్లు సమాచారం.సాధారణంగా ఇంజెక్షన్లు అనేక మార్గాల ద్వారా ఇస్తారు.

భుజాలు, పిరుదులకు వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేయడం సాధారణంగా చూస్తూనే ఉంటాం.ఎక్కువగా కండరాల ద్వారా ఇంజెక్షన్ ఇస్తారు.

దీనినే ఇంట్రామస్కులర్ దారి అని కూడా పిలుస్తారు.

అయితే ప్రభుత్వం రెండు నిబంధనలకు అనుగుణంగా కొవాగ్జిన్ ట్రయల్స్ నిర్వహించనుంది.

చర్మం కింది పొరకు వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.ఎందుకంటే కండరాలకు ఎక్కువగా తట్టుకునే స్వభావంతో పాటు ఎక్కువ మందును తీసుకుంటుంది.

చర్మం కింది పొరకైతే తక్కువ మోతాదులో వ్యాక్సిన్ ఇచ్చినా సరిపోతుందని, ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని భారత బయోటెక్ సంస్థ పేర్కొంది.భారత్ పేదరిక దేశంతో పాటు అధిక జనాభా ఉన్న దేశం కాబట్టి తక్కువ ధరకే వ్యాక్సిన్ దొరుకుతుందన్నారు.

అలాగే జనాభా ఎక్కువగా ఉన్న దేశాలకు ఈ వ్యాక్సిన్ ను తక్కువ ధరకే అందిచబోతున్నట్లు సంస్థ వెల్లడించింది.ఇప్పటికే దేశవ్యాప్తం 12 ఆస్పత్రుల్లో 1125 మందిపై కొవాగ్జిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube