ఎన్టీఆర్‌కు అనుకున్న టైటిల్‌ను బుక్‌ చేసిన బాలయ్య  

Ruler Title For Balakrishna-

ఎన్టీఆర్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘దమ్ము’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోకున్నా కూడా ఎన్టీఆర్‌ కు ఆ చిత్రం మంచి పేరును అయితే తీసుకు వచ్చింది. ఇక ఆ చిత్రంలోని రూలర్‌ అనే పాట అద్బుతంగా సాగింది. భారీగా ఆ పాటను చిత్రీకరించారు. లిరిక్స్‌ కూడా అందరిని ఆకట్టుకున్నాయి..

ఎన్టీఆర్‌కు అనుకున్న టైటిల్‌ను బుక్‌ చేసిన బాలయ్య-Ruler Title For Balakrishna

ఇక బోయపాటి మరియు ఎన్టీఆర్‌ల కాంబోలో మరో సినిమా రాబోతుందని, దానికి రూలర్‌ అనే టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. ఎన్టీఆర్‌కు అయితేనే రూలర్‌ బాగుంటుందని అంతా అనుకున్నారు.

రూలర్‌ టైటిల్‌తో ఎన్టీఆర్‌ సినిమా ఉంటుందని, అదుగో, ఇదుగో అంటూ రకరకాల ప్రచారం జరిగింది.

కాని సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. అసలు ఎన్టీఆరనకు రూలర్‌ టైటిల్‌పై ఆసక్తి ఉన్నట్లుగా అనిపించడం లేదు. అందుకే ఆ టైటిల్‌తో ఇప్పుడు బాలయ్య సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

భారీ ఎత్తున అంచనాలున్న బాలకృష్ణ, కేఎస్‌ రవికుమార్‌ల మూవీకి సి కళ్యాణ్‌ ‘రూలర్‌’ అనే టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించినట్లుగా తెలుస్తోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పలు టైటిల్స్‌ను పరిశీలించిన తర్వాత చివరకు ఈ టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంకు పవర్‌ ఫుల్‌ రూలర్‌ టైటిల్‌ను ఫిక్స్‌ చేయడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జై సింహా నిరుత్సాహ పర్చడంతో దర్శకుడు ఈ సారి చాలా జాగ్రత్తగా ఈ చిత్రంను రూపొందిస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.

రూలర్‌ టైటిల్‌తో సినిమా సగం సక్సెస్‌గా భావించవచ్చు. ఈ నెలలోనే ప్రారంభం కాబోతున్న ఈ చిత్రంను వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు.