రివ్యూ : 'రూలర్‌'తో బాలయ్య ఫ్లాప్‌లకు బ్రేక్‌ పడిందా?

వరుసగా బాలయ్య చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి.అయినా కూడా ఏమాత్రం రాజీ పడకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

 Rularmovie Review-TeluguStop.com

జై సింహా చిత్రంతో గత ఏడాది కేఎస్‌ రవికుమార్‌తో కలిసి వచ్చిన బాలయ్య ఈసారి ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.నందమూరి ఫ్యాన్స్‌కు 20 రోజుల ముందే సంక్రాంతి రాబోతుంది అంటూ ప్రకటించాడు.మరి ఈ చిత్రం ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

ప్రమాదంకు గురైన బాలకృష్ణకు జయసుధ చికిత్స చేయించి దత్తత తీసుకుంటుంది.తన కంపెనీకి హెడ్‌ ను చేస్తుంది.ఆమె కంపెనీను సక్సెస్‌ ఫుల్‌ గా రన్‌ చేస్తున్న బాలయ్యకు వ్యాపార పనిమీద యూపీ వెళ్తాడు.అక్కడ బాలకృష్ణను చూసి అంతా షాక్‌ అవుతారు.ఆ సమయంలోనే బాలయ్య గతంను గుర్తు చేస్తారు.

అక్కడ విలన్స్‌ పని పడతాడు బాలయ్య.ఇంతకు బాలయ్యకు ఏమైంది? బాలయ్య ఇందులో ఎన్ని పాత్రల్లో కనిపించాడు? పూర్తి కథ ఏంటీ అనే విషయాన్ని తెలుసుకునేందుకు సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన :

బాలకృష్ణ ఎప్పటిలాగే ఈ చిత్రంలో కూడా మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించే విధంగా యాక్షన్‌ సీన్స్‌తో దుమ్ము రేపాడు.డాన్స్‌ల విషయంలో కూడా చాలా కష్టపడ్డాడు.

ఇక రొమాంటిక్‌ సీన్స్‌ చేసేందుకు ప్రయత్నించినా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.ఇక డైలాగ్‌ డెలవరీతో బాలయ్య మరోసారి తన సత్తా చాటాడు.

హీరోయిన్స్‌ సోనాల్‌ చౌహాన్‌ కు పెద్దగా ప్రాముఖ్యత లేదు.ఆమె కేవలం స్కిన్‌ షోకు పరిమితం అయ్యింది.

వేదిక తన పాత్రలో పర్వాలేదు అనిపించింది.భూమిక పాత్ర గురించి చాలా అనుకున్నారు.

కాని భూమికది కూడా పెద్దగా పాత్ర ఏమీ లేదు.జయసుధ ఎప్పటిలాగే తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.ప్రకాష్‌ రాజ్‌ మరియు ఇతర నటీనటులు పర్వాలేదు అనిపించారు.

టెక్నికల్‌ :

Telugu Ksravi, Rular Day, Rular Review-Movie Reviews

చిరంతన్‌ భట్‌ అందించిన పాటలు సో సో గానే ఉన్నాయి.ప్రేక్షకులు పాటలు వచ్చినప్పుడు అబ్బా అన్నట్లుగా ఫీల్‌ అయ్యారు.ఇక ఆయన అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా బాబోయ్‌ అన్నట్లుగా ఉంది.

ఒకటి రెండు సీన్స్‌ మినహా మొత్తం అంతా కూడా సేమ్‌ ఉన్నట్లుగానే ఉంది.ఇక సినిమాటోగ్రఫీ బాగుంది.సినిమాను కలర్‌ ఫుల్‌గా తీయడంతో పాటు కొన్ని యాక్షన్‌ సీన్స్‌ సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది.దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది.

దర్శకత్వం కూడా పర్వాలేదు అన్నట్లుగా ఉంది.ఎడిటింగ్‌లో జర్క్‌లు ఉన్నాయి.ఇక నిర్మాణాత్మక విలువలు కథానుసారంగా ఉన్నాయి.

విశ్లేషణ :

జైసింహా చిత్రంతో ఫ్లాప్‌ ఇచ్చినా కూడా చాలా కొద్ది సమయంలోనే కేఎస్‌ వికుమార్‌కు మరో సినిమాతో ఛాన్స్‌ ఇవ్వడం అంటే బాలయ్య ఘట్స్‌కు మెచ్చుకోవాలి.ఎంతో మంది యంగ్‌ హీరోలు ఉన్నా కూడా ఈయనతోనే సినిమా చేయాలని బాలయ్య అనుకోవడం జరిగింది.అయితే ఈ చిత్రంతో బాలయ్య అభిమానులను పూర్తిగా సంతృప్తి పర్చడంలో విఫలం అయ్యాడు.

అభిమానులకు కొన్ని సీన్స్‌ వింధులా ఉన్నా సామాన్య ప్రేక్షకులు చూడదగ్గ విధంగా ఏమీ లేదు.బాలయ్య ఇమేజ్‌ను పెంచేందుకు ప్రయత్నించాడు తప్ప కథ మరియు కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లుగా అనిపించలేదు.

ప్లస్‌ పాయింట్స్‌ :

కథలో ట్విస్ట్‌లు,

కొన్ని యాక్షన్‌ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌ :

ఎడిటింగ్‌,

సంగీతం, స్క్రీన్‌ప్లే,

ఎంటర్‌టైన్‌మెంట్‌ లేకపోవడం.

బోటమ్‌ లైన్‌ :

‘రూలర్‌’ కొందరికి కిక్‌ ఇచ్చే విధంగా ఉంది.

రేటింగ్‌ : 2.75/5.0

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube