తిట్టిన వారే ఇప్పుడు నీ కడుపు చల్లగుండా అంటున్నారు  

Rtc Workers Comments About Cm Kcr-telangana Cm Kcr,telangana Rtc Strike

తెలగాణ సీఎం మరోసారి తన మార్క్‌ రాజకీయం చూపించాడు.ఆర్టీసీ కార్మికులు దాదాపు రెండు నెలల పాటు సమ్మె చేశారు.దేశ వ్యాప్తంగా కేసీఆర్‌పై విమర్శలు వ్యక్తం అయ్యాయి.50 వేల మంది ఉద్యోగులను ఉద్యోగాల నుండి తొలగించడం ఏంటీ అంటూ ప్రశ్నించాడు.తెలంగాణ ఆర్టీసీ విషయమై కేంద్రం కూడా స్పందించే వరకు వెళ్లింది.

Rtc Workers Comments About Cm Kcr-telangana Cm Kcr,telangana Rtc Strike Telugu Viral News Rtc Workers Comments About Cm Kcr-telangana Kcr Telangana Strike-RTC Workers Comments About CM KCR-Telangana Cm Kcr Telangana Rtc Strike

ఇలాంటి సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు.సమ్మె విరమించిన తర్వాత కూడా ప్రభుత్వం వారిని విధుల్లోకి తీసుకోలేదు.వారిని విధుల్లోకి తీసుకోక పోవడంతో లేడీ కండక్టర్లు మరియు ఆర్టీసీ కార్మికులు అంతా కూడా కేసీఆర్‌ను సర్వ నాశనం అవ్వాలంటూ శపించారు.

కేసీఆర్‌ను తిట్టిన కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో చాలా వైరల్‌ అయ్యాయి.

కట్‌ చేస్తే ఇప్పుడు అదే ఆర్టీసీ కార్మికులు నీ కడుపు చల్లగుండా, నీ అంత గొప్ప సీఎం లేడు, నీ అంత మంచి సీఎం లేడు, నీ అంతగా మమ్ములను పట్టించుకున్న సీఎం లేడు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.మాకు ఎలాంటి కార్మిక సంఘాలు అవసరం లేదని, తాము అంతా కూడా నీతోనే ఉంటామంటూ ఈ సందర్బంగా ఆర్టిసీ కార్మికులు చెబుతున్నారు.ప్రస్తుతం ఆర్టీసీ అభివృద్ది కోసం అంతా పని చేస్తామంటూ అభినందనలు గుప్పించారు.