ఆర్టీసీ జేఏసీ ఈ విధంగా ప్లాన్ చేసిందా ? కేసీఆర్ కు షాకేనా

తెలంగాణాలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విషయంలో అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు ఎక్కడా తగ్గకుండా ప్రతిష్టంభనకు వెళ్తున్నారు.ఈ విషయంలో హైకోర్టు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసినా సమస్య ఇప్పటికీ పరిష్కారం అవ్వలేదు.

 Rtc Jac Leders Declared Their Future Plan Over Strike-TeluguStop.com

ఇక కార్మికులకు డెడ్ లైన్ విధించినా కార్మికులు వెనక్కి తగ్గకపోగా ఇప్పుడు సరికొత్త రీతిలో ఉద్యమాన్ని పరుగులు పెట్టించేందుకు తగిన ప్రణాళికలు వేసుకున్నారు.

తాజాగా వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించిన ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది.

ఈ మేరకు సోమవారం తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.అదేవిధంగా ఈ నెల 13,14 తేదీల్లో ఢిల్లీ వెళ్లి మానవ హక్కుల కమిషన్‌కు దీనిపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది.

ఛలో ట్యాంక్‌బండ్ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వ తీరుపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.అవసరమైతే జేఏసీ నాయకులతో కలిసి ఢిల్లీలో ఒక రోజు దీక్ష చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ఇక ఈ నెల 18 వ తేదీన సడక్ బంద్‌ కూడా చేపట్టాలని ఈ సందర్భంగా తీర్మానించుకున్నారు.ఛలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం సందర్భంగా మావోయిస్టులు కూడా అందులో ఉన్నారని హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

కార్మికులు, రాజకీయ పార్టీల కార్యకర్తలే నిరసనలో పాల్గొన్నారని చెప్పారు.పోలీసులు భాష్ప వాయువు ప్రయోగించడం వల్లే చాలామంది గాయాలపాలయ్యారని కేసీఆర్ కార్మిక ఉద్యమాన్ని ఎంతగా అణచాలనుకున్నా తాము ఎక్కడా తగ్గేది లేదని వారు ప్రకటించారు.

దీన్ని బట్టి చూస్తే ఆర్టీసీ కార్మిక నేతలు సమ్మె విషయంలో ఎక్కడా వెనకడుగు వేసే పరిస్థితి కనిపించడంలేదు.అదీ కాకుండా కోర్టు కూడా సమ్మె విషయంలో సానుకూలంగా ఉండడంతో కార్మికుల్లో మరింత ధీమా పెరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube