స్పందన లేని ప్రభుత్వం సమ్మె కొనసాగుతుందంటున్న ఆర్టీసీ జేఏసీ

తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె పై ఇప్పటికీ పీట ముడి వీడడం లేదు.కెసిఆర్ తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్నట్టుగా ఈ వ్యవహారంలో వెనక్కి తగ్గకపోవడంతో ఆర్ టి సి జేఏసీ నాయకులు కాస్త వెనక్కి తగ్గారు.

 Rtc Jac Is On Strike-TeluguStop.com

దీంతో సమ్మె ముగిసింది ,కార్మికులు మళ్లీ విధుల్లోకి చేరేందుకు సిద్ధం అవుతున్నారు అని అంతా భావిస్తున్న సమయంలో సమ్మె ముగియ లేదని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది.ఎంజీబీఎస్ లో ఆర్టీసీ జేఏసీ నాయకుల అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.

ప్రభుత్వం సమ్మె విషయంలో సానుకూలంగా స్పందించకపోవడంతో సమ్మెను యధాతధంగా కొనసాగిస్తున్నామని నాయకులు ప్రకటించారు.కార్మికులు ఎవరు విధుల్లో చేరలేదని ,ఎవరు అసత్య ప్రసారాలను నమ్మవద్దని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి పేర్కొన్నారు.

అలాగే రేపు సేవ్ ఆర్టీసీ పేరుతో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తామని, ప్రభుత్వ తీరును అక్కడే ఎండగడతామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube