ఆర్టీసీ సమ్మె : నేడు అర్థరాత్రితో గడువు పూర్తి, ఎంత మంది జాయిన్‌ అయ్యారు?

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవల మంత్రి మండలి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల కోసం మరో అవకాశం ఇచ్చారు.ఈనెల 5వ తారీకు వరకు అంటే నేడు అర్థరాత్రి వరకు ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించి డ్యూటీలో చేరాలని, నేడు చేరకుంటే వారు ఉద్యోగం కోల్పోయినట్లే అంటూ హెచ్చరించాడు.

 Rtc Employes Are Not Join In Today-TeluguStop.com

ఇప్పటికే కేసీఆర్‌ గతంలో ఒక గడువు ఇచ్చాడు.ఆ గడువుకు ఎవరు జాయిన్‌ అవ్వలేదు.

ఈసారి ఎవరైనా జాయిన్‌ అవుతారా అనే చర్చ జరిగింది.

ఇప్పటికే నెల రోజులు గడిచినా కూడా ప్రభుత్వం మెట్టు దిగి రాని కారణంగా ఈ గడువులో కార్మికులు ఉద్యోగాల్లో జాయిన్‌ అవుతారని అంతా భావించారు.

కాని కార్మికులు ఇప్పటి వరకు జాయిన్‌ అయ్యేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.ఒకరిద్దరు జాయిన్‌ అవ్వాలనుకున్నా కూడా కార్మిక సంఘం నేతలు వారిని వారిస్తున్నారు.వారిని భయపెడుతున్నారని ప్రచారం జరుగుతోంది.మొత్తానికి నేటి అర్థరాత్రి వరకు కనీసం వంద మంది కూడా డ్యూటీలో జాయిన్‌ అయ్యే పరిస్థితి లేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube