బంద్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట

ఆర్టీసీ కార్మికులు రేపు బంద్‌ నిర్వహించబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.కార్మికుల బంద్‌కు జనసేన, కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలు మరియు ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల వారు మద్దతు తెలుపనున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది.

 Rtc Employes Announce The Tomorrow No Holiday-TeluguStop.com

ఈ నేపథ్యంలో బంద్‌ చాలా సీరియస్‌గా స్రిక్ట్‌గా జరుగుతుందని భావించారు.కాని అసలు రేపు బంద్‌ లేదని, మరోసారి ప్రజా సంఘాలు మరియు పార్టీలతో భేటీ కాబోతున్నట్లుగా ఆర్టీసీ కార్మిక నాయకుల జేఏసీ సభ్యులు ప్రకటించారు.

కార్మికులు మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత బంద్‌ విషయమై చర్చ జరుగనున్నట్లుగా సమాచారం అందుతోంది.బంద్‌కు అన్ని వర్గాల నుండి సహకారం అందడం ఖాయం అంటూ కార్మికులు భావిస్తున్నారు.

అయితే బంద్‌ కారణంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏంటీ ఆ తర్వాత పరిణామాలు ఏంటీ అనే విషయమై చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను తొలగించినట్లుగానే భావిస్తుంది.

అందుకు గాను కొత్త ఎంప్లాయిస్‌ను హైర్‌ చేసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube