పండుగ పూట పిండేసుకుంటున్న ప్రైవేట్‌ వాహనదారులు

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతోంది.ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసింది.

 Rtc Effect Private Vehicles Profit Huge Charges Are Taken In Private Vehicle-TeluguStop.com

అయినా కూడా ఇంకా ప్రైవేట్‌ వాహనాల దందా కొనసాగుతోంది.హైదరాబాద్‌ నుండి పండుగకు సొంత ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి.

సాదారుణంగా హైదరాబాద్‌ నుండి విజయవాడకు 300 నుండి 500 వరకు చార్జీ ఉంటుంది.కాని ఇప్పుడు మాత్రం వెయ్యి వరకు అవుతుందని ప్రయాణికులు వాపోతున్నారు.

ఇక హైదరాబాద్‌ లోకల్‌లో కూడా బస్సులు లేక పోవడం వల్ల ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.ఎక్కువ శాతం మెట్రోను ఆశ్రయిస్తున్నా కూడా కొందరికి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్‌ వాహనాలు అయిన 7 సీటర్‌ ఆటోలు, తుఫాన్‌లు ఎక్కాల్సి వస్తుంది.

మెహిదీపట్నం నుండి చిలుకూరు బాలాజీ ఆలయంకు మామూలుగా అయితే 50 లోపు చార్జీ అవుతుంది.కాని ఇప్పుడు 200 రూపాయలు పెట్టాల్సి వస్తుంది.తుఫాన్‌లు ఏకంగా 200 రూపాయలు తీసుకుని మరీ చిల్కూరులో వదిలి పెడుతున్నారు.పండుగ కనుక చిల్కూరుకు భారీ ఎత్తున భక్తులు వెళ్తున్నారు.

క్యాబ్‌ బుక్‌ చేసుకుంటే 500 రూపాయలు అవుతుందని ఇలా పబ్లిక్‌ ట్రావెల్స్‌ను ఎక్కితే కూడా అలాగే పిండి వదిలి పెడతున్నారు.మొత్తానికి ఈ పండగ సమయంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ప్రభుత్వం ఎన్ని ప్రత్యామ్యాయ ఏర్పాటు చేసినా కూడా సరిపోవడం లేదు అంటూ ప్రయాణికులు వాపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube