తెలంగాణాలో పెరగబోతున్న ఆర్టీసీ చార్జీలు ?

ఇప్పటి వరకు తెలంగాణ లో హాట్ టాఫిక్ గా మారిన ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ కారణంగా అటు ప్రభుత్వం ఇటు కార్మికులు, ప్రజలు అందరూ చాలా ఇబ్బందులకు గురయ్యారు.ఏదైతేనేమి కథ అయితే సుఖంతం అయ్యింది.

 Rtc Charges To Rise In Telangana Cm Kcr Desided-TeluguStop.com

కార్మికులంతా రేపటికల్లా విధుల్లోకి చేరాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడంతో అంతా ఊపిరీపిల్చుకున్నారు.అంతా సెట్ అయ్యింది అనుకుంటున్న సమయంలో ఆర్టీసీ చార్జీలు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది తెలంగాణలో రోడ్డు రవాణా సంస్థ.

దీనికి సీఎం కేసీఆర్ కూడా ఒకే చెప్పారు.సోమవారం నుంచి చార్జీలు పెంచి ఆర్టిసి ఆర్దిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టబోతున్నారు.

కిలోమీటర్ కు ఇరవై పైసల చొప్పున పెంచాలని చూస్తున్నారు.ఆర్టీసీలో ఆర్దిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో చార్జీలు పెంపు తప్ప మరో మార్గం లేదని కేసీఆర్ భావిస్తున్నారు.

ఆర్టీసీకి సుమారు వంద కోట్ల రూపాయల మేర సహాయం అందిస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube