ప్రయాణికులపై పెనుభారం పడింది.చార్జీల మోత మోగింది.టీఎస్ఆర్టీసీ టిక్కెట్లు, బస్‌పాస్‌ల చార్జీలు పెరిగాయి.సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ చార్జీలు అమల్లోకి వస్తున్నాయి.
కిలోమీటర్‌కు 20 పైసల వంతున ఛార్జీలు పెరగనున్నాయి.ఛార్జీల పెంపు వల్ల ఏడాదికి 750 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.అన్ని రకాల బస్సుల్లో టికెట్ చార్జీలు పెరగనున్నాయి.ఈ మేరకు పల్లె వెలుగు బస్సులో కనీస ఛార్జీ ఐదు రూపాయల నుంచి పది రూపాయలకు పెరగనుంది.అలాగే సెమీ ఎక్స్‌ప్రెస్ కనీస ఛార్జీ 10 రూపాయలుగా నిర్ధారించారు.ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కనీస ఛార్జీ పది రూపాయల నుంచి 15 రూపాయలకు పెంచారు.డీలక్స్ కనీస ఛార్జీ 15 రూపాయల నుంచి 20 రూపాయలకు, సూపర్ లగ్జరీలో కనీస ఛార్జీ 25 రూపాయలకి, రాజధాని, వజ్ర బస్సుల్లో కనీస ఛార్జీ 35 రూపాయలు , గరుడ ఏసీ, గరుడ ప్లస్ ఏసీలో కనీస ఛార్జీ 35 రూపాయలు, వెన్నెల ఏసీ స్లీపర్‌లో కనీస ఛార్జీ రూ.75లకు పెంచారు.దీంతో పాటు అన్ని రకాలు బస్పాసుల ఛార్జీలు పెరిగాయి.
సిటీ ఆర్డీనరీ పాస్ఛార్జీ రూ.770 నుంచి రూ.950లకు, మెట్రోపాస్ ఛార్జీ రూ 880 నుంచి రూ.1070కి పెరిగింది.మెట్రో డీలక్స్ పాస్ఛార్జీ రూ.990 నుంచి రూ.1180కి పెరగనుంది.స్టూడెంట్ బస్‌పాస్ రూ.
390 నుంచి 495 రూపాయలకి, డే పాస్ రూ.80 నుంచి వంద రూపాయలకు పెరిగాయి.