శానిటైజర్ కోసం స్టీరింగ్ వదిలేసిన బస్సు డ్రైవర్!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ విజృంభిస్తుంది.రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి.

 Karim Nagar,rtc Bus, Sanitizer, Bus Accident,corona Effect-TeluguStop.com

ఇక తాజాగా రాష్ట్రంలో అమలు పరిచిన కొన్ని సడలింపుల కారణంగా బస్సులు రోడ్లు ఎక్కాయి.ఇక కరోనావైరస్ కట్టడి తరుణంలో ఒక డ్రైవర్ శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకునే తరుణంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టడం జరిగింది.

దీనితో పెద్ద ప్రమాదం నుంచి ప్రయాణికులు మొత్తం బయటపడ్డారు.ఇక ప్రయాణికులు తెలియజేసిన వివరాలు ప్రకారం… సిరిసిల్ల డిపోకు చెందిన నాన్ స్టాప్ ఆర్ టి సి బస్ కరీంనగర్ నుంచి సిరిసిల్లకు బయలుదేరింది.

వేములవాడ మండలం అగ్రహారం సమీపంలో కరీంనగర్ పాల డైరీ వద్ద డ్రైవర్ స్టీరింగ్ విడిచిపెట్టి చేతులకు శానిటైజర్ చేసుకుంటూ ఉండగా బస్సు అదుపు తప్పి డివైడర్ ను డి కొట్టడం జరిగింది.
దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనలకు గురి అయ్యారు.

ఇక వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపి వేయడం జరిగింది.దీనితో బస్సులో ఉన్న వారికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

ఇక బస్సులో దాదాపు 20 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube